Home తాజా వార్తలు డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదు: ఎక్సైజ్ శాఖ‌

డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదు: ఎక్సైజ్ శాఖ‌

Drugs

 

హైదరాబాద్: టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సినీ తారలు సహా ఏ ఒక్కరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటివరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేశామని, ఇంకా ఐదు ఛార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉందన్నారు. సినీ ప్రముఖుల వ్యవహారంలో ఫోరెన్సిక్ ఆధారాలు వచ్చాయని వివరించారు. త్వరలో మిగతా ఛార్జిషీట్లు దాఖలు చేస్తామని వెల్లడించారు. మాదక ద్రవ్యాల కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని అధికారులు హెచ్చరించారు. ఈ కేసులో 62 మందిని విచారించామని, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. ఇంకా పలు ఆధారాలు రావల్సి ఉందని  వచ్చిన తరువాత సరైన చర్యలు తీసుకుంటామన్నారు.

 
Telangana Excise Officers Investigation on Drugs Case