Home తాజా వార్తలు తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్ అద్భుతం…

తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్ అద్భుతం…

Fiber Grid

 

మహేశ్వరం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ పైలెట్ ప్రాజెక్టు మహేశ్వరం మండలంలో సత్పలితాలిస్తుందని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటర్నెట్ సేవలు మరింత చేరువయ్యాయని నైగర్ దేశానికి చెందిన ఐటిశాఖ మంత్రి ఇబ్రా హిమగుయింబాసైదో ప్రశంసించారు.

శుక్రవారం తుమ్మలూర్ గ్రామాన్ని సందర్శించి ఫైబర్ గ్రిడ్ పనితీరు ఇంటర్నెట్‌పై గ్రామస్తులకున్న అవగాహనను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్‌గ్రిడ్ పైలెట్ ప్రాజెక్టును మహేశ్వరం తుమ్మలూర్ మన్సాన్‌పల్లి సిరిగిరిపురం గ్రామాల్లో అమలు చేస్తుండగా నైగర్ దేశానికి చెందిన ఐటి మంత్రితో పాటు ప్రతినిథి బృదం తుమ్మలూర్ గ్రామంలో ఫైబర్‌గ్రిడ్ అమలు తీరును నిషితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇంటింటికి ఇంటర్నెట్ వైఫై వీడియో కాన్ఫరెన్స్ జాదూస్ మినిథియోటర్ ద్వారా గ్రామస్తులు పొందుతున్న సేవలు గురించి గ్రామసర్పంచ్ మద్ది సురేఖ కరుణాకర్‌రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ సేవలపై ప్రజల అవగాహన స్మార్ట్ విలేజ్ అభివృద్ది గురించి గ్రామస్తులు ప్రతినిథి బృందానికి వివరించారు. ఫైబర్ గ్రిడ్ సేవలను ప్రశంసించిన ఇబ్రాహిమగుయింబాసైదో మాట్లాడుతూ… తమ దేశంలో ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు అమలు చేయడానికి క్షేత్రస్దాయి పరిశీలన చేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఫైబర్‌గ్రిడ్ అధికారులు శ్రీనివాస్‌రెడ్డి రవిశంకర్ ఉపసర్పంచ్ గోవర్దన్ స్దానిక నాయకులు శ్రీహరి శ్రీధర్‌రెడ్డి చంద్రయ్య నాగార్జున శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Fiber Grid Admirable