Thursday, April 25, 2024

నవంబర్ 14న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

Telangana Film Chamber elections on November 14

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్‌సిసి) పాలక కమిటీ గడువు ముగియనుండడంతో నవంబర్ 14న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ “టిఎఫ్‌సిసి స్థాపించి ఏడేళ్లు పూర్తయింది. ఇక ప్రస్తుతం 30 మందితో కూడిన టిఎఫ్‌సిసి పాలక కమిటీ గడువు ముగియనుండడంతో నవంబర్ 14న ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా అదే రోజు జరుగనున్నాయి”అని అన్నారు. ఎన్నికల అధికారి కెవిఎల్ నరసింహారావు మాట్లాడుతూ “నవంబర్ 14న ఫిలింనగర్‌లోని టిఎఫ్‌సిసి కార్యాలయంలో ఈ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.గురురాజ్, కాచెం సూర్యనారాయణ, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News