Home తాజా వార్తలు ‘ఆ భూములకు ఎవరడ్డొస్తారో చూస్తాం’

‘ఆ భూములకు ఎవరడ్డొస్తారో చూస్తాం’

                              Revanth-Reddy

రంగారెడ్డి: శంషాబాద్ మండలం ఘంసిమియాగూడలో టి టిడిపి నేతలు పర్యటించారు. గోల్డ్ స్టోన్ సంస్థ రూ.వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడిందని టిటిడిపి ఎంఎల్‌ఎ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఇప్పటికీ భూములన్నీ గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భూకుంభకోణాలపై ఎక్కడా చర్యలు తీసుకోవడంలేదని దుయ్యబట్టారు. మియాపూర్ భూముల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. భూకుంభకోణాలపై సిబిఐచే విచారణ జరిపించాలని కోరారు. రైతులు తమ భూమిని తామే దున్నుకోవాలని, ఎవరడ్డొస్తారో చూస్తామని రేవంత్ హెచ్చరించారు. సిఎం కెసిఆర్ ఘంసిమియాగూడకు వచ్చి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కెకె భూముల్లో టిటిడిపి నేతలు నాగలితో దున్నారు. అన్యాక్రాంతమైన భూములను ఎంఎల్‌ఎ రేవంత్ రెడ్డి, టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, ఇతర నేతలు పరిశీలించారు.