Sunday, February 5, 2023

చిన్న పరిశ్రమలకు చెయ్యి

  • నూతన పారిశ్రామిక విధానంపై కోదండరామ్ విమర్శ 
- Advertisement -

Kodandaram-TJACహైదరాబాద్ : చిన్న,సూక్ష్మ, మధ్య తరహా పరిశ్ర మలకు నూతన పరిశ్రామిక పాలసీ ఏ మాత్రం దోహదపడడం లేదని, దీనికి కోసం ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను విస్మరిస్తే ఆర్థిక ప్రగతికే నష్టమని అన్నారు. మూతపడిన పరిశ్రమలను వెంటనే పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో శనివారం అఖిల భారత చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య కన్వీనర్లు ఎం.ప్రభాకర్‌రావు, కె.కోటేశ్వరరావు, వి.కె.చక్ర వర్తి, ఖాయిలా పడిన వివిధ పరిశ్రమల నిర్వాహకులతో కలిసి కోదండరామ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పెద్ద పెద్ద పరిశ్ర మలకు భూములను కేటాయించేందుకు వేల ఎకరాలను సేకరిస్తున్న ప్రభుత్వం, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు కూడా కనీసం 250 గజాల స్థలాన్ని సేకరించి ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి, హౌసింగ్ కాలనీలకు అనుసంధానం చేస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. పరిశ్రమల సమస్యలపై సదస్సు ను నిర్వహించి, అఖిలపక్ష మద్దతు కోరాలని, తద్వారా బడ్జెట్ సమా వేశాల్లో ఈ సమస్యను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషి చేసేలా ప్రయత్నించాలని సూచించారు. వరి పంటలు పెరుగుతున్న నేపథ్యం లో అందుకు వీలుగా మిల్లులు పనిచేయాలని, డిఫాల్ట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖాయిలా పడిన సంస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని, ఆర్‌బిఐ మార్గదర్శకాలను పాటించేలా బ్యాంకులతో సమావేశాన్ని నిర్వహంచి, పన్నుల రాయితీలు కల్పించి, పునరుద్ధరణకు ప్రొత్సహించాలని సూచించారు. పరిశ్రమల ఆస్తుల జప్తు అంశంలో చట్ట సరవణలు రావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. విద్యుత్ సరఫరా లేక ఉత్పాదకత తగ్గిందని, తద్వారా సమస్యలల్లో చిక్కుకున్నాయని  తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో మరి కొన్ని సంస్థలు సంక్షోభంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 6500 పరిశ్రమల ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయని, ఈ సంస్థల పనిచేసే సుమారు 8 లక్షల మంది ఉపాధి కోల్పోయారని, వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ. 12వేల కోట్ల ఆదాయం తగ్గిందని తెలిపారు. ఎం.ప్రభాకర్‌రావు మాట్లాడుతూ మూతపడిన సంస్థలన పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి కెటిఆర్ హామీనిచ్చినా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రత్యేకంగా ఎస్‌ఎల్‌బిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి మూతపడిన సంస్థలను పునరుద్ధరించాలని కోరారు.  కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ కార్పోరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేస్తున్న ప్రభుత్వం చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను విస్మరిస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles