Tuesday, January 31, 2023

దళితులకు దన్ను

  • ఎస్‌సి, ఎస్‌టిల కోసం సబ్‌ప్లాన్ కేటాయింపులకంటే అధికంగా ఖర్చు చేస్తున్నాం : సమీక్షలో సిఎం కెసిఆర్ 
  • మూడు నెలలకోసారి సమీక్ష..
  • హాస్టళ్ల ప్రక్షాళన…
  • గదులు, మరుగుదొడ్లు మెరుగు…
  • మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెరగాలి…
  • అధికారులతో ముఖ్యమంత్రి
- Advertisement -

KCR-Meetingహైదరాబాద్ : ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం దక్కాల్సిన నిధుల కన్నా, ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు, పేదరి కంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించినందు న, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న విషయాన్ని సిఎం గుర్తు చేశారు. ఈ క్రమంలో సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు గురైన ఎస్‌సి, ఎస్‌టిల పట్ల మరింత శ్రద్ధ వహించాలని సిఎం చెప్పారు, ఎస్‌సి, ఎస్‌టిల కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేయడమే కాకుండా, ప్రభుత్వం తమ కోసం ఉన్నదనే భరోసా కూడా వారికి కల్పించే విధంగా, పారదర్శకంగా ఉండాలని సూచించా రు. ఖర్చు చేసిన వివరాలు, విషయాలు తెలియక పోతే తమను ప్రభుత్వం నిర్లక్షం చేస్తున్నదనే భావన వారికి కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ అమ లు, వారి అభివృద్ధి, సంక్షేమం కోసం తీసు కోవాల్సిన చర్యలపై సోమవారం ప్రగతి భవన్‌లో సిఎం సమీక్ష నిర్వహించారు. ‘ఎస్‌సి, ఎస్‌టిలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, ఖర్చు చేసేందుకు సబ్ ప్లాన్ తెచ్చారు. దానిని మరింత సమర్థవంతంగా అమలు చేసే విషయంలో ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉంది. సబ్ ప్లాన్ విషయంలో ప్రతినెలా అధికారులు సమీక్ష జరపాలి. మూడు నెలలకోసారి మంత్రులు సమావేశాలు నిర్వహించాలి. కేవలం సబ్ ప్లాన్ ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించిననిధులే కాకుండా, తెలంగాణ ప్రభుత్వం ఆయా వర్గాల కోసం ఇంకా ఎక్కువే ఖర్చు చేస్తున్నది. ఇదే ఒరవడి ఇంకా ముందు కొనసాగాలి. సమాజంలో అత్యంత వెనుబడిన వర్గాలు ఎస్‌సి, ఎస్‌టిలే. కాబట్టి వారికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలి. తెలంగాణ ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి పిల్లలకు మంచి చదువు అందించాలనే లక్షంతో ఎంత ఖర్చయినా వెనుకాడకుండా రికార్డు స్థాయిలో గురుకుల విద్యాలయాలు పెడుతున్నది. భావి తరాలకు మంచి విద్య అందించడం ద్వారానే ఆయా వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుంది. ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ అందిస్తు న్నది. ఆర్థిక సహాకార పథకాలు, ఇతర పథకాల్లోనూ సబ్సిడీ అందిస్తున్న ది. కళ్యణలక్ష్మీ, దళితులకు భూ పంపిణీ లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఇంకా ఇతర పథకాల్లో కూడా ఈ వర్గాలకే గరిష్ఠ లబ్ధి జరుగుతున్నది. సబ్ ప్లాన్‌లో కేటాయించిన దానికన్నా ఎక్కువ నిధులే వారికి అందుతున్నాయి. ఇది మంచి పరిణామం, కొనసాగాలి” అని సిఎం చెప్పారు. “రాష్ట్రంలో హాస్టళ్ళ పరిస్థితి బాగా మారాలి. కనీస సౌకర్యాలు మెరుగుపర్చేందుకు శ్రద్ధ తీసుకోవాలి. మరుగుదొడ్లు, గదులు బాగుండాలి. విద్యార్థులకు చెల్లించే మెస్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు అవసరమైన రీతిలో పెరగాలి. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఎస్‌సి, ఎస్‌టిలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇవ్వాలి. పరిమితి అక్కర్లేదు” అని సిఎం స్పష్టం చేశారు.
“గతంలో ఎస్‌సి, ఎస్‌టిలకు అసైన్డు భూములు ఇచ్చారు. స్వంత భూములు కూడా ఉన్నాయి. ఆ భూములన్ని వినియోగంలోకి రావాలి. వారు వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైన సహకారం అందించాలి. భూమి సాగులోకి వస్తే మంచి ఆర్థిక వనరు అవుతుంది. మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమం కూడా కొనసాగించాలి” అని సిఎం ఆదేశించారు.
“కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో మార్పులు చేసింది. ప్రణాళిక,ప్రణాళికేతర పద్దులు తీసివేసింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు,పెన్షన్లు, అప్పుల కిస్తీలు, కార్యాలయాల నిర్వహణ వంటి ఖర్చులు పోను మిగతా వ్యయమంతా ఒకే పద్దు కింద చూపించాలనే మార్గదర్శకాలు రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటిని విధిగా అనుసరించాలి. ఈ నేపథ్యంలో ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ రూపకల్పనకు అనుసరించాల్సిన వ్యూహం రూపొందించాలి” అని సిఎం సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె.శ్రీహరి, ఎస్‌సి అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, ఎం.పి బాల్క సుమన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles