Home తాజా వార్తలు మహిళా సాధికారతకు ప్రాధాన్యత…

మహిళా సాధికారతకు ప్రాధాన్యత…

Women Empowerment

 

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తోందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న ఏడుగురు మహిళా ఆర్‌ఎస్సైలు సోమవారం సిపిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఎస్సైలు స్వాతి, అరుణ, మమత, అనిత,లక్ష్మి, శ్రావణి, స్రవంతి 2018బ్యాచ్‌లో ఆర్‌ఎస్సైలుగా ఎంపికయ్యారు.

ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో భాగంగా రెండు నెలలుపాటు ట్రాఫిక్ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తించనున్నారు. మరో నెల రోజులు సిటి పోలీస్, సిఎఆర్, ఐఎస్‌డబ్లూ, పిటిఓలో శిక్షణ తీసుకోనున్నారు. అన్ని విభాగాలపై అవగాహన పెంచుకోవాలని, నగరంలో వాడుతున్న టెక్నాలజీ గురించి తెలుసుకోవాలన్నారు. మహిళలల్లో భరోసా నింపేందుకు విజిబుల్ పోలిసింగ్ సమర్ధవంతంగా పనిచేస్తుందని అన్నారు. పోలీసులను ఆశ్రయించిన మహిళలు, యువతులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

Telangana Government Prioritizes Women Empowerment