Home తాజా వార్తలు చట్టానికి లోబడే అప్పులు చేస్తున్నాం: ఈటెల

చట్టానికి లోబడే అప్పులు చేస్తున్నాం: ఈటెల

Etela

హైదరాబాద్: యాదవుల, కుర్మల జీవితాల్లో వెలుగుల కోసం కృషి చేస్తున్నామని ఈటెల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన శాసన సభలో మాట్లాడుతూ… యాదవులు, కుర్మలకు 75 శాతంతో రాయితీతో గొర్రెలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం చట్టానికి లోబడి, ఎఫ్‌ఆర్‌బిఎం అర్హత ప్రకారమే అప్పులు తీసుకుంటోందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సాగునీరు, విద్యుత్ కోసమే అప్పులు చేస్తున్నామని ఈటెల స్పష్టం చేశారు. ప్రభుత్వ నిజాయితీపై ఎవరికీ అపోహలు అవసరం లేదన్నారు.