Saturday, April 20, 2024

పాలన పరుగులు

- Advertisement -
- Advertisement -
CM-KCR
సమ్మేళనాలతో అధికారుల పల్లె, నగర బాట, పనిచేసే అధికారులకు అవార్డులు…రివార్డులు,  నిర్లక్షంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు,  పాలనలో సరికొత్త ముద్రవేసుకునే పనిలో సిఎం కెసిఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో పాలన మరింతగా పరుగులు తీయనుంది. ఇ టీవల ముగిసిన పురుపోరు ఎన్నికలతో రాష్ట్రంలో ప్రధాన ఎన్నికల తంతు ముగిసింది. రాష్ట్రంలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు ఎటువంటి ఎన్నికలుగానీ, ఎ న్నికల నిబంధనలు అమలుయ్యే అవకాశం లేకపోవడంతో పరిపాలనలో సరికొత్త పుంతలను తొక్కించే పని లో సిఎం కెసిఆర్ పడ్డారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకుని ఇటీవల ముగిసిన పురపోరు వరకు వరసగా ఎన్నికలు జరిగాయి. దీంతో ప్రతి మూడు, నాలుగు మాసాలకు ఒకసారి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ కోడ్ కారణంగా రాష్ట్రంలో అభివృ ద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.

ఇందులో భాగంగానే రానున్న నాలుగేళ్ళలో తాను ఎటువంటి పాలనను అందించబోతున్నాననే అంశంపై రెండు రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో సిఎం కెసిఆర్ తేల్చి చెప్పారు. పలు అంశాలపై యువ అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రా ధాన్యతలు, లక్ష్యాలపై సుమారు 11 గంటలకు పాటు వారికి సిఎం కెసిఆర్ వివరించారు. అధికారులు తమ సొంత ఎజెండాను పక్కనపెట్టి ప్రభుత్వ పథకాల అమలే పరమావధిగా పెట్టుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. ఇందులో పనిచేసే అధికారులకు తప్పకుండా గుర్తింపునిస్తామని, అలాగే నిర్లక్షంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో పాలనపై సిఎం కెసిఆర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇక సమ్మేళనాలతో పల్లెలు, పట్టణాల్లో పూర్తిగా మార్పులు రావాలని సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు తగు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమాలతో పట్టణాలు, పల్లెల పరిస్థితిలో పూర్తి గా మార్పు తీసుకొచ్చే అంశాలపై అధికారులు దృష్టి సా రించారు. ముఖ్యంగా పల్లెల్లో 25 రోజుల్లోనే ఈ మార్పు కనిపించాలని సిఎం స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరేసేలా కార్యక్రమాలను చేపట్టనున్నారు. రాష్ట్రంలో నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను జోరు పట్టించేదుకు మళ్ళీ పలె ్లప్రగతి, పట్ణణ ప్రగతి కార్యక్రమాలను చేపడతారు.

దీని కంటే ముందుగానే పల్లెల్లు, పట్టణాల్లో ప్రత్యేకంగా సమ్మేళనంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలనే అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వీటి ఆధారంగానే పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. ఆ పనులను నిధుల కోరత రాకుండా పంచాయతీలకు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం రూ.319 కోట్లను మంజూరు చేస్తుండగా, తాజాగా హైదరాబాద్ నగరానికి నెలకు రూ. 78 కోట్లు, మిగతా పట్టణాలు, నగరాలకు నెలకు మరో రూ.70 కోట్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని అయినా ఎస్‌టి, ఎస్‌సి ప్రాంతాల నుంచే మొదలుపెట్టాలని సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. ఈ ని ర్ణయం ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీసుకున్న దాఖలాలు లేవు. కానీ సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి పాలనలో తనదైన ప్రత్యేకతను మరోసారి చాటుకోనున్నారు.

Telangana Government to Speed Up Development Works

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News