Home తాజా వార్తలు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి : గవర్నర్ తమిళిసై

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి : గవర్నర్ తమిళిసై

Governor Tamilisaiహైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలుపునిచ్చారు. గురువారం హెచ్ఐసిసి లో ప్రారంభమైన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ -2019ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి పొదుపును పాటించాలని ఆమె సూచించారు. స్వచ్ఛమైన నీరు ఉంటేనే ప్రజలు ఆరోగ్యంతో ఉంటారని ఆమె స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తామని , సోలార్ వినియోగం పెంచుతామని, మట్టి పాత్రలను పెంచుతామని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని గవర్నర్ అభినందించారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటడమే కాదు, వాటిని పెంచాలని ఆమె పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ -2019 సదస్సు కొనసాగనుంది.

Telangana Governor Tamilisai Speech On Environment