Home తాజా వార్తలు కాల్‌డేటా కేసులో స్టే

కాల్‌డేటా కేసులో స్టే

High-Court_manatelangana copyమన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్‌ట్యాపింగ్ సంబంధించిన కేసులో తెలంగాణ సర్కారుకు ఊరట లభించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన కాల్‌డేటా ఇవ్వాల్సిందిగా టెలికాం ఆపరేటర్లకు విజయవాడలోని సిఎంఎం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర స్టే ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఎంఎం కోర్టుకు సర్వీసు ప్రొవైడర్లు సీల్ కవర్లలో ఇచ్చిన నివేదికలను తక్షణమే ప్రత్యేక దూత ద్వారా హైకోర్టుకు తరలించి జ్యుడీషియల్ రిజిస్ట్రార్ వద్ద భద్రపర్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ విలాస్ వి.అఫ్జల్ పుర్కర్ గురు వారంనాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాల్‌డేటా వివాదానికి సంబంధించి దాఖలైన పిటి షన్ల విచారణార్హతపై వచ్చిన అభ్యంతరాలను తోసి పుచ్చుతూ వాటిని విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యాల్లో నాలుగు వారాల్లో కౌంటర్లను దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణా రెడ్డి వాదనలు ప్రారంభిస్తూ  సీఎంఎం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై జ్యుడీషియల్ రివ్యూ చేసే విచక్షణాధికారం హైకోర్టుకు ఉంటుందనితెలిపారు.

ఈ కేసులో అర్జెన్సీ ఉందని ,జూలై 31 లోగా కాల్ డేటా వివరాలు సీల్ కవరులో ఇవ్వాలని సు ప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో సీఎంఎఁ కోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని, హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున తనతో పాటు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ,కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజన్ వాదనలు వినిపిస్తారని  తెలిపారు. సర్వీసు ప్రొవైడర్లనుంచి ఫలానా సమాచారం మాకు కావాలని కోరే హక్కు టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2) కింద తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని అదనపు సోలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజన్ తెలిపారు. ఈ సమాచారాన్ని వెల్లడిస్తే విభేదాలు వస్తాయని ,ఇటువంటి సమాచారాన్ని వెల్లడించాలని సీఎంఎం కోర్టు ఎలా ఆదేశాలు జారీ చేస్తుందని సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలాని ప్రశ్నించారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేద ని ఏపీ ఏజీ పి.వేణుగోపాల్  వాదించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతివాది కాదని ,సర్వీసు ప్రొవైడర్ల విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు ముందుకు రాలేదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత  ఉందని స్పష్టం చేసిం ది. ఈ వ్యాజ్యాలను విచారణకు స్వీకరించింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ  ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదు పరి విచారణను వాయిదా వేసింది. టెలిఫోన్ వివాదానికి సంబంధించి కాల్ డేటా ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ టెలికం ఆపరేటర్లకు ఈ నెల 7న  విజయ వాడలోని ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) కోర్టు జారీ చేసిన  ఉత్తర్వులను నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు  తెలంగాణ ప్రభుత్వం తరఫున హోంశాఖ ము ఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా మంగళవారం హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖకార్యదర్శి,కేంద్ర సమా చార ,ఐటీ, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ కార్యదర్శి….,కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ డీఎస్పీ,టెలికం ఆపరేటర్లు బీఎస్‌ఎన్‌ఎల్,భారతి ఎయిర్ టెల్, ఐడియా సెల్యూలార్,రిలయెన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలను ప్రతి వాదులుగా  చేర్చారు. 25 నంబర్లకు సంబంధించిన కాల్ డేటా,అందుకు సంబందించిన ఐజీపీ (ఇంటలిజెన్స్), ఐసీజీ  ఇచ్చిన లేఖల ప్రతులను ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లోని సెక్షన్లు 123,124,131 లకు ,సీఆర్ పీసీలోని  సెక్షన్ 91కి వ్యతిరేకమని వాది హైకోర్టుకు విన్నవించారు. ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ,మంత్రివర్గ సభ్యులు, విజయవాడలోని తన ల్యాండ్ లైన్ …మొబైల్ ఫోన్లను ట్యాప్ చేశారంటూ జూన్ 8వతేదీన దేవినేని ఉమా మహేశ్వరరావు విజయవాడ భవానిపురం పోలీసు  ఠాణాలో ఫిర్యాదు చేశా రు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన సిట్ అధికారులు  కాల్ డేటా ఇవ్వాలంటూ  ఆపరేటర్లనుఆదేశించాలని విజ యవాడ సీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సీఎంఎం కోర్టు  టెలి కం ఆపరేటర్లకు సమన్లు జారీ చేసింది.  కాల్ డేటా ఇవ్వాలని  ఏపీ పోలిసు లు వద్దని తెలంగాణ పోలీసులు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ టెలికం  ఆపరేటర్లు సు ప్రీంకోర్టును ఆశ్రయించారని వివరించారు. ఎస్‌ఎల్పీలను విచారించిన సు ప్రీంకోర్టు ఈ వ్యాజ్యాల్లో గడువును పెంచింది. డాక్యుమెంట్లు అందిన నెల రో జుల తర్వాత విచారణ చేయాలని సూచించిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్టును ఆయా రాష్ట్రాల్లోని యంత్రాంగం అమలు పరచేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విన్నవించారు.