Thursday, April 25, 2024

ఎఎఫ్‌ఎస్ అధికారి కుటుంబానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

Telangana Govt allotted land to family of IFS officer

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఎఎఫ్‌ఎస్ అధికారి భార్యకు మరో ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ మేరకు బుధవారం తగు ఉత్తర్వులు జారీ చేసింది. 2008లో కాబుల్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎఎఫ్‌ఎస్ అధికారి వెంకటేశ్వర్‌రావు మరణించారు. ఈ నేపథ్యంలో సదరు కుటుంబాన్ని ఆదుకుందుకు రాష్ట్ర ప్ఱభుత్వం సదరు అధికారి భార్యకు షేక్‌పేట పరిధిలోని సర్వే నెంబర్ 403లో 475 గజాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

2008 కాబుల్ ఉగ్రవాదుల దాడిలో వెంకటేశ్వరరావు మరణించగా ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 2014లో జూబ్లీహిల్స్‌లోనే 475 గజాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భూ విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు తక్షణమే ఆమెకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించించి. కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం షేక్‌పేట పరిధిలో భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News