Home తాజా వార్తలు దేవర్‌ యాంజల్ ఆక్రమణలపై విచారణ

దేవర్‌ యాంజల్ ఆక్రమణలపై విచారణ

Telangana govt committee on devarayanjal temple lands

 

నలుగురు ఐఎఎస్ అధికారులతో కమిటీ
గ్రామ పరిధిలోని శ్రీసీతారామస్వామి దేవస్థానానికి చెందిన 1521 ఎకరాల భూముల కబ్జా ఆరోపణలు
మాజీ మంత్రి ఈటల, మరికొందరు భూములు ఆక్రమించారన్న ఫిర్యాదులపై కదిలిన ప్రభుత్వం
వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు నేతృత్వంలోని కమిటీకి ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్/మెదక్: శామీర్‌పేట్ దేవర్‌యాంజల్ ఆలయ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఇతరులు భూములు ఆక్రమించారన్న ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు నలుగురు ఐఎఎస్ అధికారులతో కమిటీని నియమించింది. పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రా వు నేతృత్వం వహించనున్న ఈ కమిటీ లో నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీ వన్ పాటిల్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోలికేరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతిలు సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు సిఎస్ సోమేష్‌కుమార్ సో మవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్ పేట మండలంలోని దేవరయంజాల్ గ్రామపరిధిలో గల శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి చెందిన సుమారు రూ.1000 కోట్ల విలువ గల 1521 ఎకరాల 13 గుంటల భూ ములను మాజీ మంత్రి ఈటల రాజేందర్, మరి కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున కబ్జా చేశారని, బినామీ పేర్లతోనూ కబ్జాకు వివిధ పత్రికలు, మీడియాలో వస్తున్న కథనాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ కమిటీ ఆలయ భూములకు సంబంధించిన వివిధ అంశాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తెలిపింది. ఆక్రమణలకు గురయిందని ఫిర్యాదులు అందిన భూమి వివరాలను సేకరించడం, ఆ భూములు ఆక్రమణకు ఎట్లా గురయింది..?, ప్రస్థుతం ఆ భూమిని దేనికి వినియోగిస్తున్నారు… ?, ఆక్రమణ దారుల దగ్గర వున్న డా క్యుమెంట్లు ఏమిటి..?, దీనికి సంబంధించి ఏదైనా ప్రభుత్వ సంస్థ అనుమతులు ఇచ్చిందా అనే విషయాలను సేకరించాలని పేర్కొంది. అలాగే ప్రస్థుతం అమలులో వున్న ప్రభుత్వ నిబంధనలను ఆక్రమణ దారులు ఎట్లా ఉల్లంఘించారు అనే వివరాలను సేకరించి, ఖాలీ భూములు ఎంత విస్తీర్ణంలో వు న్నాయి..?, ఆక్రమణల వెనకున్న బినామీలు ఇతర పెద్దమనుషులు ఎవరు..?, తద్వారా దేవాలయానికి ఎంతమేరకు ఆదాయం నష్టం జరుగుతున్నది..?, దర్యాప్తు అనంతరం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ..?అనే విషయాలను ఈ కమిటీ నిర్దారించవలసి వుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిటీకి ఆదేశిలిచ్చారు.

మాసాయిపేటలో మరింత లోతైన విచారణ
మాజీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. గత శనివారం ప్రాథమిక విచారణలో 66.1 ఎకరాల్లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించిన అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మూడో రోజైన సోమవారం విజిలెన్స్, ఏసీబీ అధికారుల బృందాలు మాసాయిపేట తహశీల్దార్ కార్యాలయంలో, అచ్చంపేటలో విచారణ చేపట్టి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మాసాయిపేట తహశీల్దార్ కార్యాలయంలో శనివారం రైతుల విచారణలో లభించిన ఆధారాలు భూ పత్ర ఆధారాలుగా రెవెన్యూ రికార్డులను, పహనీలను, చేత్వార్ దస్త్రాలు పరిశీలించి వివరాలను నమోదు చేశారు. అలాగే రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అలాగే అచ్చంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో జగదీశ్వరచారీ హకీంపేట, అచ్చంపేట గ్రామపంచాయతీ కార్యదర్శులు జమున హ్యచరీస్ నిర్మాణాలు, వాటి అనుమతులు, నిబంధనలకు లోబడి పనులు జరిగాయా, వాటికి సంబంధించిన పన్నులు చెల్లిస్తున్నారా అనే వివరాలను నమోదు చేశారు. ఇదిలా ఉండగా అధికారుల విచారణలో కబ్జాకు గురైన భూ వివరాల వెల్లడి అవుతుండటంతో పలువురు రెవెన్యూ అధికారుల గుబులు చెందుతున్నారు. అసైన్డ్‌భూమి క్రయవిక్రయాలు జరిగిన సమయంలో భూ లోసుగులు ప్రమేయం ఉన్న పలువురు రెవెన్యూ అధికారుల నుంచి విజిలెన్స్, ఏసీబీ అధికారులు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే విచారణలో రోజురోజుకు వెలువడుతున్న విషయాలతో వెల్దుర్తి మండల రెవెన్యూలో పనిచేసిన తహశీల్దార్లతో పాటు ఇతర సిబ్బంది ప్రమేయం ఉందని తెలుస్తుండటంతో వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, అధికారులతో పాటు ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో భూకబ్జాలో ప్రమేయం ఉన్న అధికారులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.

Telangana govt committee on devarayanjal temple lands