Saturday, April 20, 2024

మెరుగైన రోడ్ల నిర్మాణంపై దృష్టి

- Advertisement -
- Advertisement -

Telangana govt is focused on building better roads

పలు జాతీయ రహదారుల కోసం కేంద్రానికి విజ్ఞప్తులు
మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నెట్‌వర్క్

హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తరువాత మెరుగైన రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధాన రహదారులను జాతీయ రహదారుల పరిధిలోకి తీసుకురావటం, జిల్లా, మండల స్థాయిలో రహదారి వ్యవస్థను మెరుగుపరచటం ద్వారా మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి జాతీయ రహదారులు విస్తరణ, పంచాయతీరాజ్-, ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించింది. దీంతోపాటు జాతీయ రహదారుల కోసం కేంద్రానికి అనేక విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అందులో భాగంగా పలు రహదారులకు నిధులను కేంద్రం మంజూరు చేస్తోంది. నేడు తెలంగాణలో మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్‌వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే, అందులో రాష్ట్రం సగటు 5.02కిలోమీటర్లు.

ఇవేకాకుండా రాష్ట్రం లో రూ.13 వేల కోట్ల వ్యయం కాగల మరో 8 జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ ఏర్పడే నాటికి దక్షిణాదిలో అట్టడుగున ఉన్న రాష్ట్రం, నేడు అగ్రభాగంలో నిలవడమే కాకుం డా దేశ సగటును మించింది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి కేవలం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే కొత్తగా రూ.11,983 కోట్ల వ్యయంతో 3,150 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసింది. 57 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో మొత్తం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరైతే, కేవలం నాలుగున్నరేండ్లలో అంతకన్నా ఎక్కువగా 3,150 కిలోమీటర్ల నిడివి కలిగిన 36జాతీయ రహదారులు మంజూరయ్యాయి.

హైదరాబాద్-విశాఖ మార్గానికి పచ్చజెండా

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్- విశాఖ మార్గానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ రహదారికి 765 డిజి నెంబర్‌నూ కేటాయించింది. సుమారు 158 కిలోమీటర్ల నిడివి గల ఈ మార్గాన్ని పూర్తి చేస్తే తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరుగనుంది. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు ఇప్పటికే జాతీయ రహదారి అందుబాటులో ఉంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు ఫోర్‌లేన్ విస్తరణ పనులు సాగుతున్నాయి. ఖమ్మం నుంచి దేవరాపల్లి వరకు రహదారిని 4 వరుసలుగా విస్తరించాల్సి ఉంది. అక్కడి నుంచి విశాఖ వరకు ఇప్పటికే 4వరుసల మార్గం ఉంది. ఈ రహదారిని హరిత మార్గంగా నిర్మించాలని కేంద్రం ఇంతకు ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి కృష్ణప ట్నం, విశాఖపట్నం పోర్టులకు సరకు రవాణాకూ ఈ మార్గం ఉపకరిస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే భూ సేకరణ ప్రక్రియ చేపట్టేందుకు అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

ఆర్‌అండ్‌బీ పరిధిలోని 7,554 కిలోమీటర్ల

దీంతోపాటు ఆర్‌అండ్‌బీ పరిధిలోని 7,554 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్డుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,257 కోట్లను విడుదల చేసింది. రూ.7,463 కోట్లతో 2020 మార్చి నాటికి 5,453 కిలోమీటర్ల రోడ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. రోడ్ల మరమ్మతుల కోసం రూ.1,868 కోట్లు ఖర్చు చేసింది. మంజీర, గోదావరి, మానేరు, ప్రా ణహిత, మున్నేరు, అకేరు, మూసీ, తుంగభద్ర తదితర నదులపై రూ. 9,084 కోట్ల వ్యయంతో 26 భారీ వంతెనలు నిర్మాణాలు చేపట్టింది.

ఇప్పటికే 16 నిర్మాణాలను పూర్తి చేసింది. 201819లో బడ్జెట్‌లో రూ. 5,575 కోట్లు, 2019-20లో రూ.2,219 కోట్లు, 2020-21లో రూ.3493.67 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లోనే కొత్త పంచాయతీల్లో రహదారులకు రూ.5 వేల కోట్లు, సిసి రోడ్లకు మరో రూ.600 కోట్లు కేటాయించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 143 మండల కేంద్రాలకు జిల్లా కేంద్రం నుంచి డబుల్ లేన్ బిటి రోడ్లు లేవు. రూ.2,518 కోట్ల వ్యయంతో 1,875 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్లుగా మార్చి రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలకు జిల్లా కేంద్రాల నుంచి డబుల్ లేన్ రోడ్డు సౌకర్యం సమకూర్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News