Home తాజా వార్తలు ఐఎఎస్, ఐపిఎస్ బదిలీలు

ఐఎఎస్, ఐపిఎస్ బదిలీలు

Telangana Govt Prepared IAS, IPS officers Transfer List

వ్యవసాయశాఖ కమిషనర్‌గా రాహుల్ బొజ్జా, జిహెచ్‌ఎంసి అదనపు
కమిషనర్‌గా ఆమ్రపాలి, గద్వాలజిల్లా కలెక్టర్‌గా కె.శశాంక, మంచిర్యాల జిల్లా
కలెక్టర్‌గా భారతి హోళికెరి, రామగుండం ఎస్‌పిగా సత్యనారాయణ, వనపర్తి
ఎస్‌పిగా అపూర్వరావు, భద్రాద్రి కొత్తగూడెం ఎస్‌పిగా సునీల్‌దత్, జగిత్యాలకు
సింధుశర్మ, సూర్యాపేటకు వెంకటేశ్వర్లు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం ఐదుగురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న జగన్‌మోహన్ త్వరలో పదవీ విరమణ చేయనుండడంతో ఆయ న స్థానంలో రాహుల్ బొజ్జాను నియమించారు. ప్రస్తుతం ‘ధరణి’ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా ఉన్న రజత్ కుమార్ సైనీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా నియమించారు. జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్‌గా ఉన్న భారతి హోళికెరిని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా నియమించారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న కాటా ఆమ్రపాలిని జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్‌గా నియమించారు. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న కె.శశాంకను గద్వాల జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. పదకొండు మంది ఐఏఎస్ అధికారులను మంగళవారం బదిలీ చేయగా దానికి కొనసాగింపుగా ఐదుగురిని బుధవారం బదిలీచేశారు. మరికొన్ని బదిలీలు కూడా ఉండే అవకాశం ఉందని సచివాయల వర్గాలు పేర్కొన్నాయి.

తొమ్మిది మంది ఐపిఎస్‌ల బదిలీలు :
ఐఏఎస్‌లతో పాటు తొమ్మిది మంది ఐపిఎస్ అధికారులను కూడా ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నగర సాయుధ రిజర్వు పోలీసు విభాగం హెడ్‌గా పనిచేస్తున్న శివప్రసాద్‌ను నగర అదనపు పోలీసు కమిషనర్ (అడ్మిన్)గా బదిలీ చేశారు. ఆ స్థానంలో పనిచేస్తున్న మురళీకృష్ణను ‘కార్’ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. దక్షిణ మండలం డిసిపిగా ఉన్న సత్యనారాయణను రామగుండం పోలీసు కమిషనర్‌గా బదిలీ చేసి ఆ స్థానంలో ఉన్న విక్రమ్‌జిత్ దుగ్గల్‌ను బదిలీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్‌పిగా ఉన్న అంబర్ కిషోర్ ఝాను నగర దక్షిణ మండల డిసిపిగా నియమించారు.

జగిత్యాల ఎస్‌గా పనిచేస్తున్న సునీల్‌దత్‌ను భద్రాద్రి కొత్తగూడెం ఎస్‌పిగా, రాష్ట్ర సిఐడి విభాగంలో అదనపు ఎస్‌పిగా పనిచేస్తున్న అపూర్వరావును వరపర్తి ఎస్‌పిగా బదిలీచేశారు. వనపర్తి ఎస్‌పిగా పనిచేస్తున్న రోహిణీ ప్రియదర్శిని గత కొంతకాలంగా సెలవులో ఉన్నారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సింధూశర్మను జగిత్యాల ఎస్‌పిగా నియమించారు. వరంగల్ నగర తూర్పు డిసిపిగా ఉన్న వెంకటేశ్వర్లును సూర్యాపేట జిల్లా ఎస్‌పిగా బదిలీచేశారు. ఆ జిల్లా ఎస్‌పిగా పనిచేస్తున్న ప్రకాశ్ జాదవ్‌ను సిఐడి ఎస్‌పిగా బదిలీ అయ్యారు.

140 మంది జాయింట్ కలెక్టర్ల బదిలీలు
యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ (స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్)గా పనిచేస్తున్న జి.రవిని హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఓజె మధును జనగాం జిల్లాకు, స్వర్ణలతను జయ శంకర్ భూపాలపల్లి జిల్లాకు, జె.నిరంజన్‌ను జోగులాంబ గద్వాల జిల్లాకు, డి.యాదిరెడ్డిని కామా రెడ్డి జిల్లాకు, మస్రత్‌ఖనమ్ ఆయే షాను ఖమ్మం జిల్లాకు, పి.శ్రీనివా సరెడ్డిని నాగర్ కర్నూల్ జిల్లాకు, ఏ.భాస్క ర్‌రావును నిర్మల్ జిల్లాకు, డి.వేణుగో పాల్‌ను వనపర్తి జిల్లాకు, ఆర్.మహేంద ర్‌రెడ్డిని వరంగల్ రూరల్ జిల్లాకు, జి.రమేశ్‌ను యాదాద్రి భువనగిరి జిల్లాకు, ఎం.వెం కటేశ్వర్లును నిజామా బాద్ జిల్లాకు, కె. వెంకటేశ్వర్లును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, ఎం.డేవిడ్‌ను మహబూబాబాద్ జిల్లాకు జాయింట్ కలెక్టర్‌లుగా బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు