Saturday, April 20, 2024

ఈ వర్షాకాలంలోనూ ధాన్యం కొంటాం

- Advertisement -
- Advertisement -
Telangana govt to buy Grain Says CM KCR
రైతులు ఆందోళన పడొద్దు తేమ పరిమితికి మించకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా 6545 సేకరణ కేంద్రాలుంటాయ్ సిఎం కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్: గత సంవత్సరం మా దిరిగానే ఈ వర్షాకాలంలో కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. పోయిన సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యథావిధిగా ఈ సంవత్సరం కూడా ఆ కేంద్రాల ధాన్య సేకరణ జరపాలని పౌర సరఫరాల శాఖాధికారులను సిఎం మవారం ప్రగతిభవన్‌లో ధా న్యం సేకరణపై ముఖ్యమం త్రి కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు వి షయంలో రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సిఎం సూచించారు. మధ్ధతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరగడానికి కావలసిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంఒ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ప్రియాంకవర్గీస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News