Home హైదరాబాద్ హరితహారం ప్రణాళిక ఖరారు

హరితహారం ప్రణాళిక ఖరారు

haritha-haram

శాఖలు, జిల్లాల వారీగా లక్షాల నిర్దేశం…  నర్సరీల ఏర్పాటును పూర్తి చేసిన అధికారులు

హైదరాబాద్: ప్రభుత్వ అత్యంత ప్రాధా న్యత పథకాలలో ఒకటైన హరితహారం నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేశారు. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా 40 కోట్ల మొ క్కలు నాటాలని నిర్ధేశించిన అధికారులు శాఖలు, జిల్లాల వారీగా లక్షాలను నిర్ధేశించారు. త్వరలో నాలుగవ విడత హరితహారం కార్య క్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్షాలతో పాటు నర్సరీల ఏర్పా టు ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ప్రతి ఏడాది 40కోట్లను మొక్కలను నాటాలని లక్షంగా నిర్ధేశించిన ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు విడతలుగా జరిగిన కార్యక్రమం సందర్భంగా 81.6 కోట్ల మొక్కలను నాటారు. ఈ ఏడాది కూడా మరో 40 కోట్ల మొక్కలను నాటేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రభుత్వశాఖ ఎన్ని మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఇందులో శాఖల వారీగా సమాచారం….

ఇందులో అటవీ, పర్యావరణశాఖ 394.088 లక్షల మొక్కలు, రహదారులు, భవనాలు 16.541, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ 2102.567, నీటిపారుదలశాఖ 47.721, వ్యవసాయం 428.297, రెవెన్యూ 168.579, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ 360.121, హోంశాఖ 75.077, విద్యాశాఖ 25.976, పశు సంవర్థకశాఖ 15.478, పరిశ్రమలు 91.162, గనులు 24.837, వైద్య, ఆరోగ్యం 4.563, విద్యుత్ 55.345, మహిళా శిశు సంక్షేమం 2.345, సాంఘిక సంక్షేమం 2.280, ఎస్‌సి డెవలప్‌మెంట్ 0.779, బిసి సంక్షేమం 0.964, ఎస్‌టి, ఐటిడిఎ 59.171, మైనార్టీ సంక్షేమం 3.125, యూత్, టూరిజం, సాంస్కృతికం 1.351, పౌరసరఫరాలశాఖ 1.296, కార్మిక, ఉపాధిశాఖ 432, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు 0.250, రైల్వేస్ 5.113, ఇతర శాఖల ఆధ్వర్యంలో 113.72 లక్షలు మొక్కలను నాటాలని నిర్ధేశించారు. ఆ దిశగా ఆయా శాఖల ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తమ శాఖల ఆధీనంలో ఎక్కడెక్కడ ఈ మొక్కలు నాటాలనే అంశంపై ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు.

3566 నర్సరీల ఏర్పాటు….
త్వరలో ప్రారంభం కానున్న నాలుగవ విడత కార్యక్రమానికి సంబంధించిన జిల్లాల వారీగా నర్సరీల ఏర్పాటును కూడా అధికార యంత్రాంగం పూర్తిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,566 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఇందులో అటవీశాఖ ఆధ్వర్యంలో 2,813 నర్సరీలను ఏర్పాటు చేయగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఎ) ఆధ్వర్యంలో 753 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఇందులో అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా కాకుండా పలు అటవీ ప్రాంతాలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఐటిడిఎ ఏటూరు నాగారం పరిధిలో 5 నర్సరీలు, హెచ్‌ఎండిఎ పరిధిలో 29, జిహెచ్‌ఎంసి పరిధిలో 44, కరీంనగర్ హర్టీకల్చర్ పరిధిలో 9 నర్సరీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించా రు. ఈ నర్సరీ పర్యవేక్షణ కూడా పూర్తిస్థాయిలో అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతుందని అధికారులు వివరించారు.

జిల్లాల వారీగా మొక్కలు….
రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌ను మినహాయించి మిగిలిన 30 జిల్లాలకు అధికార యంత్రాంగం లక్షాలను ఖరారు చేసింది. హైదరాబాద్ జిల్లాను మినహాయించి ఇందుకు ప్రత్యామ్నాయంగా జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ పరిధిలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. జిల్లాల వారీగా మొక్కల నాటే వివరాలు సమగ్రంగా… ఆదిలాబాద్‌లో కోటి, అసిఫాబాద్‌లో 72 లక్షలు, భూపాలపల్లిలో 1.13కోట్లు, గద్వాల్ 84 లక్షలు, జగిత్యాల్ 1.40కోట్లు, జనగామ 87 లక్షలు, కామారెడ్డి 1.32కోట్లు, కరీంనగర్ 1.37 కోట్లు, ఖమ్మం 1.97కోట్లు, కొత్తగూడెం 95 లక్షలు, మహబూబాబాద్ 96లక్షలు, మహబూబ్‌నగర్ 1.97కోట్లు, మం చిర్యాల 94లక్షలు, మెదక్ 1.31కోట్లు, మెడ్చేల్ 41 లక్షలు, నాగర్‌కర్నూల్ 1.33 కోట్లు, నల్గొండ రెండు కోట్లు, నిర్మల్ 1.02 కోట్లు, నిజమాబాద్ 1.84 కోట్లు, పెద్దపల్లి 1.06 కోట్లు, రంగారెడ్డి 86 లక్షలు, సంగారెడ్డి 2.03 కోట్లు, సిద్దిపేట 1.73 కోట్లు, సిరిసిల్ల 91 లక్షలు, సూర్యాపేట 1.39 కోట్లు, వికారాబాద్ 1.53 కోట్లు, వనపర్తి 50 లక్షలు, వరంగల్ (రూరల్) 1.14 కోట్లు, వరంగలః (అర్బన్) 62 లక్షలు, యాదాద్రి 1.05 కోట్లు, జిహెచ్‌ఎంసి 40 లక్షలు, హెచ్‌ఎండిఎ 1.70 కోట్లుగా ఖరారు చేశారు.