Friday, April 26, 2024

కరోనా, ఒమిక్రాన్‌పై కేంద్ర మార్గదర్శకాలు పాటించాలి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

Telangana High Court Key Decision on New Year 2022

హైదరాబాద్: కరోనా, ఒమైక్రాన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 21, 27న జారీ చేసిన గైడ్ లెన్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంల నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలన్న పిటిషన్‌పై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం ఒమిక్రాన్ కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. ఈ అంశానికి సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదని తెలిపారు. పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు డిసెంబర్ 21, 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్ టెస్టులను పెంచడంతో పాటు సరిపడా బెడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో ఒమైక్రాన్ పరిస్థితులపై జనవరి 3లోపు కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ హైకోర్టు జనవరి 4కు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News