మనతెలంగాణ/హైదరాబాద్ : కరీంనగర్ సిపి కమలాసన్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారుకులకు కోర్టు ధిక్కరణ కేసులో శుక్రవారం హైకోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. కరీంనగర్ సిపి కమలాసన్‌రెడ్డి, ఎసిపి తిరుపతి, కరీంనగర్ రూరల్ ఎస్హెచ్ఒ శశిధర్‌రెడ్డిలు పుష్పాంజలి రిసార్ట్‌లోకి వెళ్లరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరించడంతో ధర్మాసనం 6 నెలల జైలు శిక్ష, 10వేల జరిమానా విధించింది. అయితే జైలు, జరిమానా తీర్పులో ముగ్గురు పోలీసు అధికారులు అప్పీలుకు వెళ్లేందుకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం గడువు ఇచ్చింది. పుష్పాంజలి రిసార్ట్‌లోకి పోలీసులు వెళ్లకూడదని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఉత్తర్వులను పోలీసులు దిక్కరించి రిసార్ట్‌ల్లోకి వెళ్లారు. తన రిసార్ట్‌లో రమ్మీ ఆడుతున్నారంటూ పోలీసులు వచ్చి వేధిస్తున్నట్లు పుష్పాంజలి రిసార్ట్ యజమాని మాజీ ఎమ్మెల్యే జగపతిరావు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ నేపథ్యలో పోలీసులకు గతంలో పలు సూచనలు చేసింది. హైకోర్టు తీర్పును ఉల్లంఘించిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం జైలు, జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది.
Telangana High Court orders jail for CP in Karimnagar