Saturday, April 20, 2024

కెటిఆర్‌కు ఊరట

- Advertisement -
- Advertisement -

Telangana High Court Stay on NGT Orders

 

ఎన్‌జిటి నోటీసులపై హైకోర్టు స్టే

మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఫామ్‌హౌస్‌పై వివరణ ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి ) ఇచ్చిన నోటీసులపై మంత్రి కెటిఆర్ హైకోర్టులో సవాల్ చేయడంతో పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులను నిలిపివేస్తూ బుధవారం నాడు స్టే ఇచ్చింది. జస్టిస్ రామకృష్ణన్, సభ్య నిపుణుడు సైబల్ దాస్ గుప్తాతో కూడిన చెన్నై బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ జివొలు, చట్టాలు అమలు చేయాల్సిన మంత్రే వాటిని ఉల్లంఘించారని, జివొ నంబర్ 111 ఉల్లంఘనలపై గతంలో ఎన్‌జిటి ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని నివేదించారు. ఈక్రమంలో వివాదస్పద ఫామ్ హౌస్ తనది కాదని స్పష్టం చేస్తూ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్‌జిటి జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఇదిలావుండగా జన్వాడలో జివొ నంబర్ 111 పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో మంత్రి కెటిఆర్ ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని రేవంత్ రెడ్డి ఎన్‌జిటిలో పిటిషన్ వేశారు.

అంతేకాకుండా గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కెటిఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. దానిపై విచారించిన ఎన్‌జిటి పిటిషన్‌లోని అంశాల ఆధారంగా వివరణ ఇవ్వాలని మంత్రి కెటిఆర్, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా జివొ నంబర్ 111 ఉల్లంఘనలపై తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్‌జిటి జారీ చేసిన నోటీసులపై కెటిఆర్ ఆసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఎన్‌జిటి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, అది రాజకీయ కక్షపూరిత పిటిషన్ అని ఆయన ఆరోపించారు. నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్‌జిటి ఉత్తర్వులు జారీచేసిందన్నారు. కాగా ఎన్‌జిటి ఇచ్చిన నోటీసులలో జన్వాడ ఫాం హౌస్ విషయంలో కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిహెచ్‌ఎంసి, వాటర్ వర్క్స్, హెచ్‌ఎండీఏ ప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్లడించింది.

కట్టడం అక్రమమైతే పర్యావరణ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, వసూలు చేయాల్సిన పరిహారం అంచనా వేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా 2018లో జివొ 111 ఉల్లంఘనలపై ఎన్‌జిటి ఇచ్చిన ఉత్తర్వుల అమలు నివేదికను కూడా ఇవ్వాలని ఎన్‌జిటి పేర్కొంది.కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిహెచ్‌ఎంసి , వాటర్ వర్క్స్, హెచ్‌ఎండిఎ ప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. కట్టడం అక్రమమైతే పర్యావరణ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, వసూలు చేయాల్సిన పరిహారం అంచనా వేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2018లో జివొ నంబర్ 111 ఉల్లంఘనలపై ఎన్‌జిటి ఇచ్చిన ఉత్తర్వుల అమలు నివేదికను కూడా ఇవ్వాలని పేర్కొంది. కాగా ఎన్‌జిటి ఉత్తర్వులలోని అంశాలను పరిశీలించిన హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలిచ్చింది.

Telangana High Court Stay on NGT Orders

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News