Home యాదాద్రి భువనగిరి దేశానికే ఆదర్శంగా తెలంగాణ

దేశానికే ఆదర్శంగా తెలంగాణ

శాసనసభ స్పీకర్ సిరికొండ
MADHU

మన తెలంగాణ/యాదాద్రి : భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం యాదగిరి గుట్టకు వచ్చిన ఆయన ప్రభుత్వవిప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి ఆమె నివాసంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో బంగారు తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని అన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు సజావుగా సాగాయని, ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలో తెలంగాణ ప్రతినిధులకు మాట్లాడే ఆవకాశం ఉండేది కాదని, ఇప్పుడు సమస్యలమీద ప్రతిఒక్కరికి మాట్లాడే అవకాశం ఏర్పడిందని అన్నారు. గతంలో సమావేశాల్లో సమయం వృథా అయ్యేదని, నేడు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించి తమ సమస్యలను తెలిపేవిధంగా సమావేశాలు సాగాయని అన్నారు. ఆయన వెంట రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎంపిపి గడ్డమీది స్వప్న, జడ్‌పిటిసి కర్రె కమలమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, సర్పంచ్ బూడిది స్వామి తదితరులు పాల్గొన్నారు.