Home తాజా వార్తలు రూఫ్‌టాప్ సోలార్‌లో తెలంగాణ టాప్

రూఫ్‌టాప్ సోలార్‌లో తెలంగాణ టాప్

Rooftop Solar

 

జాతీయ స్థాయిలో రెండో స్థానం

హైదరాబాద్ : సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టు వినియోగంలో తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఆగస్టు 21న సరల్ (స్టేట్ రూఫ్‌టాప్ సోలార్ అట్రా అచీవ్‌మెంట్స్) పేరుతో కేంద్రం ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు జాతీయ స్థాయిలో రెండో స్థానం లభించింది. మొదటి స్థానం కర్ణాటకకు దక్కింది. అయితే మూడవ స్థానంలో గుజరాత్, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఈ ర్యాంకులను డిల్లీలో విడుదల చేశారు. ఐదు కీలక అంశాల ఆధారంగా ర్యాంకులను నిర్ణయిస్తారు. పాలసీ ఫ్రేమ్‌వర్క్, అమలు, పెట్టుబడిదారీ విధానం, వినియోగదారుల అనుభవం తదితర అంశాల్లో తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని కేంద్రం గుర్తించింది. మార్చి 2022 నాటికి 100 గిగావాట్ల సోలార్ విద్యుత్ లక్షంగా కేంద్రం దూకుడుగా ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే.

Telangana is nationally recognize its use of solar rooftop