Home తాజా వార్తలు దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ…

దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ…

harish-raoకోటి ఎకరాల మాగాణిగా
మార్చడమే కెసిఆర్ లక్ష్యం
తెలంగాణ సంస్కృతిని విదేశాల్లో చాటి చెప్పిన ఘనత ఎన్‌ఆర్‌ఐలదే
కోతలు, వాతలు లేకుండా
నిరంతర విద్యుత్ సరఫరా
ఫ్లోరిడాలో జరిగిన
ఆత్మీయ సమ్మేళనం
పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్‌రావు

సిద్దిపేట: తెలంగాణను కోటి ఎకరాల మా గాణిగా మార్చడమే సిఎం కెసిఆర్ ముఖ్య లక్ష్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హ రీశ్‌రావు అన్నారు. ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ట్యాంపా సిటీలో టిఆర్‌ఎ స్ అమెరికా సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీ య సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడడమే లక్షంగా సిఎం కెసిఆర్ రా ష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే రా ష్ట్రమంతా పంట పోలాలతో సస్యశ్యామలం అ వుతాయన్నారు. మన సంస్కృతిని దేశ, విదేశా ల్లో చాటి చెప్పిన ఘనత ఎన్‌ఆర్‌ఐలదేనన్నారు.

నాడు తెలంగాణ ఉద్యమంలో, నేడు రాష్ట్ర ప్రగతిలో ఎన్‌ఆర్‌ఐల కృషి మరువలేనిదన్నా రు. సిఎం కెసిఆర్ పాలనలోనే అన్ని వర్గాల వా రు సంతోషంగా ఉన్నారన్నారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విదేశా ల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలంతా ఏకతాటి పైకి వచ్చి తమ గళాన్ని వినిపించారన్నారు. కోతలు, వాతలు లేకుండా నిరంతర విద్యుత్‌ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రైతాంగానికి పెద్దపీట వేస్తూ రైతుబంధు, రైతుబీమా లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది సీఎం కేసీఆరేనన్నారు.

తెలంగాణ ప్రాంత వాసులు విదేశాలకు వెళ్లకుండా స్వరాష్ట్రంలోనే వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారన్నారు. వ్యవసాయం ప్రోఫెషనల్‌గా చేసుకునే రోజులు దగ్గర పడ్డాయన్నారు. విదేశాల్లో ఉండి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను మరువకపోవడం అభినందనీయమన్నారు. విదేశాల్లో ఉండే ప్రతి ఒక్కరూ తమ తమ పిల్లలకు తెలంగాణ సాంప్రదాయాలను అలవాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఆర్‌ఐలు హరీశ్‌రావుకు తెలంగాణ సంప్రదాయాల ప్రకారం మంగళ హారతులతో ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు బల్లా రాజేందర్, విఠల శ్రీకాంత్‌శర్మ, సుధాకర్, కిషోర్ తదితరులు ఉన్నారు.

Telangana is Role Model for Country Says Harish Rao