Home తాజా వార్తలు ధాన్యం సేకరణలో తెలంగాణ రెండవ స్థానం: మంత్రి సింగిరెడ్డి

ధాన్యం సేకరణలో తెలంగాణ రెండవ స్థానం: మంత్రి సింగిరెడ్డి

Agricultural Producing

 

హైదరాబాద్:  14.73 లక్షల రైతుల నుండి 77.41 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం సేకరణ చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. కనీస మద్దతు ధర (గ్రేడ్- ఏ) క్వింటాల్ కు రూ. 1770 ఉండగా, సాధారణ రకం క్వింటాల్ కు రూ.1750 చెల్లింపు చేస్తున్నారు. కనీస మద్దతు ధరకు సంబంధించిన చెల్లింపులను నేరుగా రైతు ఖాతాలో జామ చేయడం జరుగుందిం. సిఎం కెసిఆర్ చేపట్టిన రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, సాగు నీటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి పెరిగిందని పౌరసారఫరాల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిపినట్టు సింగిరెడ్డి తెలిపారు. ఎలాంటి లోపాలకు తావు లేకుండా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన్నట్టు వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారని, రైతుల ఫోన్ లకు ఎన్ఎంఎస్ ద్వారా తెలియజేసేలా ఒపిఎంఎస్ సాప్ట్ వేర్ ను అభివృద్ధి చేశామని ఆయన వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో పంజాబ్ తర్వాత ధాన్యం సేకరణలో రెండవ స్థానానికి తెలంగాణ చేరుకోవడానికి సిఎం కెసిఆరే కారణామని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు.

ఈ సందర్భంగా పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… సిఎం కెసిఆర్ ఆదేశాలు, మంత్రి నిరంజన్ రెడ్డి సూచనలు, సలహాలతో ధాన్యం సేకరణ సాధ్యమైందని  అన్నారు. ధాన్యం అమ్ముకోవడంలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా ధాన్య సేకరణకు సంబంధించిన విభాగాలతో రాష్ట్రస్థాయిలో సమన్వయం చేసుకున్నామని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్ కావాల్సిన నిధులను సమకూర్చడం వల్ల ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు చెల్లింపులు చేయడం జరిగింది. చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా ధాన్యం దిగుబడి అయిందని ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా విజయవంతంగా కొనుగోళ్లను పూర్తి చేయగటిగామన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

Telangana is second Largest Agricultural Producing