Friday, March 29, 2024

ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే అన్నారు. అలాగే ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్ కంటే ఎక్కువ గా వేతనాలు ఇస్తున్నాం. సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే ఆశా వర్కర్లు ఆలోచించాలని సూచించారు.

ఆశా వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. కరోనా సంక్షోభం వల్ల వేతనాలు పెంచాలని ఉన్న పెంచ లేక పోయాం ఆర్థిక పరిస్థితులు కుదుటపడగానే ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా కష్ట కాలంలో ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేనివి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. పల్లె దవాఖాన, బస్తీ దవాఖానా, హెల్త్ ప్రొఫైల్, ఉచిత డయాగ్నసిస్ సేవలు, కేసిఆర్ కిట్ వంటి కార్యక్రమాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News