Friday, March 29, 2024

రైతులను కాపాడుతున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమే

- Advertisement -
- Advertisement -

 మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు
ప్రతి విద్యార్థి కార్పొరేట్ చదువులు చదవాలనే ఉద్దేశంతో గురుకులాల ఏర్పాటు : మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్ బ్యూరో : దేశ ంలో రైతులను కాపాడుతున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర ఎక్పైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని కోడుగల్‌లో సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గతంలో 70 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వాలు రాష్ట్రంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాలలో మౌలిక సదుపాయాలు కల్పించామని, రైతు బంధు, రైతు బీమా, సిఎంఆర్‌ఎఫ్ వంటి వాటితో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు ఆచరిస్తున్నాయని, దేశంలో రైతులను కాపాడుతున్న ఏకైక ప్ర భుత్వం తెలంగాణ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలలో భాగంగా ఎన్నో అవార్డులు రావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గడిచిన తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధిని సాధించడం జరిగిందని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సమస్యలు లేకుండా చేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టితో రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి కార్పొరేట్ చదువులు చదవాలనే ఉద్దేశంతో గురుకులాలు ఏర్పా టు చేయడం జరిగిందని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు, రైతు బంధు, రైతు భీమా ద్వారా సహాయం అందిస్తూ రైతులు పండించిన ప ంటను వారి ఇంటి దగ్గరకు వెళ్లి కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. జడ్చర్ల పట్టణంలో పురాతన బావులను ఆర్కియాలజీ టూరిజ ం శాఖ ద్వారా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. మాజీ మంత్రి, జడ్చర్ల శాసన సభ్యులు డాక్టర్ సి. లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు మంచి వసతితో పాటు పాఠశాలలను తీర్చిదిద్దేందుకు మన ఊరు మన బడి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. తెలంగాణకు ముందు రాష్ట్రం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు బెరీజు వేసుకోవాలని అన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలు జడ్చర్ల నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అమలవుతున్నాయని, గ్రామాలు పచ్చబడుతున్నాయని, ప్రజలు ఆ ర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని, యాసంగిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 60 శాతం పంటలు ప ండించడం జరుగుతుందని, పల్లెలు, పట్టణాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, తెలంగాణ రాకముందు విద్యుత్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వ్యవసాయాన్ని పూర్తి గా నిర్లక్షం చేశారని ఇప్పుడు విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలతో పాటు వ్యవసాయానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. గతంలో నియోజకవర్గంలో 14 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా వాటన్నింటిని అప్‌గ్రేడ్ చేయడం జరిగిందని, కార్పొరేట్ తరహాలో విద్యనందిస్తున్నామని, కేజీ నుంచి పీజి వరకు ఉచిత విద్య ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు మ న్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి స్పష్టంగా కనబడుతుందన్నారు. వంద గురుకులాల నుంచి వెయ్యి గురుకులాలకు తీసుకెళ్లిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కోడుగల్ యాదయ్య సమావేశానికి అధ్యక్షత వహించగా గి రిజన కార్పొరేషన్ అధ్యక్షులు వాల్య నాయక్ మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఎంఎల్‌ఏ, ఎంపిలు పది లక్షల రూపాయలతో సుందరీకరించిన బస్టాండ్ ప్రాంతాన్ని, సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. అదే విధంగా 9 లక్షల రూపాయలతో ని ర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విఙ్ఞాన కేంద్రం ప్రహరీని ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కింద 70 లక్షల వ్యయంతో చేసట్టిన వివిధ పనులను ప్రారంభించారు. ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల కాంప్లెక్స్ భవన సముదాయానిక శంకుస్థాపన చేశారు. అంతేకాక 4 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల గురుకులాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సంగీత నాటక అకాడమీ మాజీ అధ్యక్షులు బాద్మీ శివ కుమార్, డిఈఓ రవీందర్, ఆర్‌డిఓతో పాటు డిపిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, గోవర్ధన్ రెడ్డి, బాలానగర్ జెడ్పిటిసి కళ్యాణి, గ్రామ సర్పంచ్ మమత నవీన్ రెడ్డి, లింగపేట సర్పంచ్ హైమావతి చాంద్ ఖాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News