Friday, March 29, 2024

ఐటిలో తెలంగాణ మేటి

- Advertisement -
- Advertisement -

Telangana IT

 ఆరేళ్ళలో అద్భుత ప్రగతి
పారిశ్రామిక, ఆర్ధిక వృద్ధి రంగాల్లో దేశానికే దిక్సూచి
పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు, సంస్కరణలతో దూసుకుపోతున్న మన తెలంగాణ

హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) లో తెలంగాణ దూసుకుపోతున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గా ఏర్పడిన కేవలం ఆరు సంవత్సరాలలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. దేశానికే ఒక దిక్సూచిగా మారింది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఐటి రంగంలో తెలంగాణ మేటిగా నిలిస్తోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీసుకున్న పలు విప్లవాత్మకమైన మార్పులు, తీసుకొచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇచ్చాయి.

ఆ ఫలితాలకు వెన్నుముఖగా ఐటి శాఖ మంత్రి కెటిఆర్ నిలిచారు. సంబంధిత అధికారులను ఎప్పటికప్పుడు పరుగులు పెట్టించడం, నిర్ధేశిత లక్ష్యాలను సకాలంలో సాధించే విధంగా తగు నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పేరుకు కొత్త రాష్ట్రమే అయినప్పటికీ ఆరేళ్ళ టిఆర్‌ఎస్ పాలనలో ఐటిలో యావత్ దేశం గర్వపడే స్థాయిలో తెలంగాణ నిలిచింది. ముఖ్యంగా ఐటి ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి రేటును సాధించింది. 2018-20-19లో ఎగుమతుల విలువ రూ. 1,09,219 కోట్ల మేరకు ఉండ గా అది 2019-20 నాటికి రూ. 1,28,807కోట్లకు పెరిగింది.

దీంతో గతేడాదితో పోలిస్తే 17.93 శాతం వృద్ధి రేటు నమోదు చేసిం ది. జాతీయ వృద్ధి రేటు 8.09 శాతంగా మాత్రమేగానే ఉంది. అంటే జాతీయ వృద్ధిరేటు కన్నా తెలంగాణ రెండింతలు వృద్ధిరేటు సాధించింది. అలాగే రాష్ట్రంలో ఐటిలో ఉద్యోగ వృద్ధిరేటు 7.2 శాతం ఉండగా, జాతీయ సగటు మాత్రం 4.93 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పనలోనూ దేశం కంటే రాష్ట్రంలో టాప్‌లో ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నారు.

దీని కారణంగానే జెఎల్‌ఎల్ యొక్క సిటి మొమెంటం ఇండెక్స్ (సిఎంఐ) 2019 లో టాప్ 20 ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. 2018-20-19లో తెలంగాణ నుంచి ఐటి, ఐటిఎస్ ఎగుమతులు 10.55 శాతం సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్) రూ.1,09,219 కోట్లకు పెరిగాయి. 2011-20-12 నుంచి2020–21 వరకు స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్) వద్ద 13.29 శాతం (రూపాయి పరంగా) 11.05 ట్రిలియన్ డాలర్లకు విస్తరించింది.

పెట్టుబడులను ప్రోత్సాహం

2018-20-19లో టైర్-II, టైర్-III నగరాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించే ప్రయత్నంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టిఎస్‌ఐసి) ప్రారంభించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 2019లో హైదరాబాద్ మెట్రో రైలు మొదటి మైలురాయిని దాటింది. సెప్టెంబర్ 2019లో టిఎస్‌ఐఐసి సంస్థ రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల గ్రామం లో ఫార్మా సిటీ ప్రాజెక్టు ను ప్రారంభించింది. ఇది 19,000 ఎకరాలలో విస్తరిం చి ఉంది. అలాగే సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో మెడికల్ డివైసెస్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది.

ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మునిసిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (టిఎండిపి)ను ప్రారంభించింది. ఫేజ్–1లో 37 పట్టణ స్థానిక సంస్థలకు, ఫేజ్-2లోని 22 పట్టణ స్థానిక సంస్థలకు జిఐఎస్ బేస్ మ్యాప్స్ తయారీ చేస్తోంది. నిర్దిష్ట వ్యాపారాలు,ఉత్పాదక విభాగాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2017 అక్టోబర్‌లో ఐఒటి (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) విధానాన్ని ప్రవేశపెట్టింది. అలాగే హైదరాబాద్‌లో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తోంది.

దేశ, విదేశీయ కంపెనీల హబ్‌గా మారుతున్న హైదరాబాద్

పారిశ్రామిక రంగంలో అద్భుతమైన ప్రగతి తెలంగాణ సాధిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెద్దఎత్తున పలు దేశ, విదేశీ కంపెనీలు తరలివస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన ఫార్మా, రక్షణ రంగాలకు చెందిన కంపెనీలతో పాటు పేరున్న పలు అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం టిఎస్…ఐపాస్ సింగల్ విండో సిస్టమ్ ద్వారా కేవలం 15 రోజుల్లోనే 57 రకాల అనుమతులను ప్రభు త్వం జారీ చేస్తోంది. ఈ అనుమతులు 23 శాఖల పర్యవేక్షణలో జారీ చేస్తోంది.

దీనికోసం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే స్పెషల్ చేజింగ్ సెల్ కూడా పనిచేస్తోంది. పారిశ్రామిక వేత్తలు అనుమతుల కోసం కార్యాలయాలకు తిరగకుండా వారికి కావాల్సిన భూమి, నీరు, కరెంట్, ఇతర మౌళిక సదుపాయలను సిద్దం చేసి, అనుమతులు కూడా టిఎస్‌ఐఐసి ద్వారా తీసుకుని పరిశ్రమలకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. ప్రభు త్వ కృషి వల్ల ప్రపంచంలోని టాప్-5 కంపెనీల్లో నాలుగు కంపెనీలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయి. ప్రస్తుతం ప్రిన్స్ పైపులు, ఫిట్టింగ్స్ కంపెనీ సుమారు రూ. 196.10 కోట్ల పెట్టుబడులతో కొత్త ఉత్పాదక విభాగాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తోంది. అలాగే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ స్కైవర్త్ తన ఉత్పత్తుల తయారీకి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. మొద టి దశలో హైదరాబాద్ కేంద్రంగా రూ. 700 కోట్లతో 50 ఎకరాలలో అత్యాధునిక ఉత్పాదక ప్లాంటును ఈ కంపెనీ ఏర్పాటు చేయబోతుంది.

ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రంగ పెట్టుబడి కానుంది. కాగా రాష్ట్రంలో నూతన పారిశ్రామిక పాలసీ అమలుల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే రూ.1,27,050 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. టిఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 11,569 కంపెనీలు అనుమతులను జారీ చేసింది. ఇందులో 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త పరిశ్రమల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఐటి, ఫార్మా, పవర్, ప్లాస్టిక్, ఇంజనీరింగ్, ఆగ్రోబోస్ట్, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్‌టైల్స్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమైబైల్ రంగాలకు చెందినవి ఉన్నాయి.

కాగా దాదాపు రూ.600 కోట్ల పెట్టుబడితో ఐకియా సంస్థ ఫర్నిచర్, టెక్స్‌టైల్స్ రంగానికి సంబంధించిన యూనిట్‌ను ఇప్పటికే ప్రారంభించిం ది. అలాగే కొక్కోకోల కంపెనీ రూ.1000 కోట్లు పెట్టుబడితో ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చింది. చైనాకు చెందిన డాంగ్‌ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ 1000మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తోంది. రూ.900 కోట్లతో ప్రాక్టర్ అండ్ గాంబుల్, రూ. 400 కోట్లతో జాన్స న్ అండ్ జాన్సన్ కంపెనీ పరిశ్రమలను ప్రారంభిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ముప్పిరెట్టిపల్లిలో తయారు చేసే ‘ఇన్సూమన్ ప్రాజెక్టు’ రూ.500కోట్లతో ఏర్పాటు కానుంది.

ప్రోత్సాహకాలు

రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పారిశ్రామికవేత్తలకు, ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామికవేత్తలకు అనే పథకాలను ప్రారంభించి పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు కల్పిస్తుంది. అలాగే సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ప్రోత్సహకాల (ఎంఎస్‌ఎంఇ)ను అందిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామిక భూముల కొనుగోలుకు, పరిశ్రమ చెల్లించే స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ తదితరాలకు 100 శాతం రీయింబర్స్‌మెంట్ ఇస్తోంది. అలాగే లీజ్‌కు తీసుకొన్నవాటికి కూడా 100 శాతం రీయింబర్స్‌మెంట్ ఇస్తోంది. కాగా భూముల కొనుగోలుకు, పరిశ్రమచెల్లించే స్టాంప్ డ్యూటీ, ట్రాన్సఫర్ తదితరాలకు 100% రీయింబర్స్‌మెం ట్ ఇస్తోంది.

లీజ్‌కు తీసుకొన్నవాటికి 100% రీయింబర్స్‌మెంట్, పారిశ్రామిక ఎస్టేట్‌లలో భూములు కొనుగోలు చేస్తే 25 శాతం రిబేటు (రూ.10 లక్షల వరకు), పారిశ్రామిక వినియోగానికి భూమి మార్పిడిచేస్తే 25శాతం తగ్గింపు ఉంటుంది. వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించిన తేదీ నుంచి ఐదేళ్లు విద్యుత పై యూనిట్‌కు రూపాయి రీయింబర్స్‌మెంట్ ఇస్తారు. మధ్య తరహా పరిశ్రమలకు ఏడేళ్ల వరకు 75 శాతం జిఎస్‌టి మినహాయింపు ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News