Home అంతర్జాతీయ వార్తలు తెలంగాణ జాగృతి యువజన సదస్సు ప్రారంభం

తెలంగాణ జాగృతి యువజన సదస్సు ప్రారంభం

Telangana Jagruthi Youth Conference beginsహైదరాబాద్: తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్ లో జరుగుతున్న ఈ సదస్సు ఆదివారం వరకు కొనసాగనుంది. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి కోసం, నూతన ఆవిష్కరణలతో దేశాభివృద్ధికి పాటుపడాలన్న సదాశయంతో ఈ సదస్సు జరుగుతుంది. ప్రారంభ సమావేశానికి సామాజిక కార్యకర్త అన్నా హజారే, సార్క్ మాజీ ప్రధాన కార్యదర్శి అర్జున్ బహదూర్ థాపా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు, 40 మంది వివిధ రంగాల ప్రముఖులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. శనివారం నాటి సదస్సులో యువత అభివృద్ధిపై ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చర్చా గోష్టి చేపట్టారు. ప్యానలిస్టులుగా అసోం ఎంపి గౌరవ్ గగోయ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్, నిజామాబాద్ ఎంపి కవిత వ్యవహరిస్తున్నారు.

Telangana Jagruthi Youth Conference begins