Friday, April 19, 2024

కంటి వెలుగు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లోని మహిళా భవనంలో ఉదయం 9 గంటలకు కంటి వెలుగు శిబిరాన్ని ముఖ్య అతిథులచే లాంచనంగా ప్రారంభించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఈ మేరకు విస్తృత స్థాయిలో చేపడుతున్న ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అవసరమైన వారికి నేత్ర పరీక్షలు నిర్వహించి, మందులు, కంటి అద్దాలు అందించేలా ప్రణాళికబద్దంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని, 18 సంవత్సరాలకు పైబడి వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకునేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్డీఓ రవి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, మెప్మా పిడి రాములు, సీడిపిఓ సౌందర్య తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News