*చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నిధులు మంజూరు
*స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
మనతెలంగాణ/దామెర: దేశంలోనే కాకుం డా ప్రపంచదేశాల్లో తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లో అందినంత అభివృద్ధి సాధిస్తుందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నా రు. నూతనంగా ఏర్పడిన దామెర మండల కేంద్రానికి మొదటిసారిగా స్పీకర్ సోమవారం వచ్చారు. జయశంకర్ భూపాలపల్లికి చెందిన ఎంబిఎం సం స్థ వారు విలాసవంతమైన గృహోపకరణ పరికరా ల ఉత్పత్తి కేంద్రాన్ని స్థానికంగా ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథులుగా స్పీకర్ హాజరై ప్రారంభించా రు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడితే ఇలాంటి సంస్థలు, పరిశ్రమలు అనేకం పుట్టుకొస్తాయన్నారు. దీని ద్వారా ప్రాంతాల అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నిధు లు మంజూరు చేస్తుందన్నారు. చిన్నచిన్న సంస్థలు ఏర్పాటు చేసుకున్న వారే భవిష్యత్తులో వేలాది మందికి ఉపాధి మార్గాలు చూపే స్థాయిలో ఉంటారన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిల్లా సరోజనీదేవి, సంస్థ బాధ్యులు ఎండి.బాబుమియా, జిల్లా గ్రంథాలయ సంస్థ బాధ్యులు ఎండి. బాబుమియా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రమణారెడ్డి, ఎస్కతాళ్ల రవీందర్, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు పున్నం సంపత్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.