Home ఆంధ్రప్రదేశ్ వార్తలు గుంటూరులో తెలంగాణ మద్యం స్వాధీనం

గుంటూరులో తెలంగాణ మద్యం స్వాధీనం

Telangana Liquor Seized In Guntur At APగుంటూరు : తెలంగాణ నుంచి కృష్ణానది మీదగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 785 సీసాల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ వెల్లడించారు. మన్నెసుల్తానపాలెం గ్రామం వద్ద తనిఖీలు చేశామని, ఈ క్రమంలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న మద్యాన్ని గుర్తించినట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు.  ఇద్దరు నిందితులు ఆటో వదిలి పరారయ్యారని ఆయన చెప్పారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్‌ చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఏఎస్‌ఐ బెన్హరి, హెడ్‌ కానిస్టేబుల్‌ హుస్సేన, సిబ్బంది నాగబాబు, హనుమంతురావు, నారాయణ, సత్యం, తదితరులు పాల్గొన్నారు.