Thursday, April 25, 2024

ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

- Advertisement -
- Advertisement -

Telangana local body election Polling end

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ శుక్రవారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలకు, ఆదిలాబాద్, ఖమ్మం, జిల్లాల్లో ఒక్కో స్థానానికి, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కోస్థానానికి ఎన్నిక జరిగింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 37 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. జెడ్పీటిసిలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. 90 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు సమాచారం. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూములకు తరలించారు ఎన్నికల అధికారులు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నెల 14 ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News