Home కరీంనగర్ తిరుమల‌ శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగుల

తిరుమల‌ శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగుల

Telangana Minister Gangula Kamalakarతిరుపతి: తిరుమల‌ శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ఆయన  నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల‌ మండపంలో మంత్రి గంగులకు వేదపండితులు ఆశీర్వచనం , స్వామి వారి పట్టువస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా గంగుల తెలిపారు. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు ఆయన వెల్లడించారు.

Telangana Minister Gangula Kamalakar Visits Tirumala