Wednesday, April 24, 2024

కరోనా పరీక్షలు చేయించుకుంటున్న మంత్రులు

- Advertisement -
- Advertisement -

Telangana ministers undergoing coronavirus tests

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పార్లమెంట్ మార్గదర్శకాల మేరకు ప్రజాప్రతినిధులంతా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కరోనా నెగటివ్ ఉన్నవారికే ఎంట్రీ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలోమంత్రులు తమ కార్యాలయాల్లో కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. మంత్రుల కార్యదర్శులకు కూడా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. జిల్లాల ఇన్‌ఛార్జీ మంత్రుల కార్యాలయాల్లోనే సంబంధిత జిల్లా శాసనసభ్యులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీష్‌రెడ్డి కరోనా పరీక్ష చేయించుకున్నారు. అలాగే ఆయన కార్యాలయంలోనే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, శాసనసభ్యులు గాధరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి కరోనా టెస్ట్ చేయించుకున్నారు.

అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి శ్రీనివాస్ రెడ్డి కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నారు. జిల్లాలవారిగా శాసనసభ్యులు తమ సొంత నియోజకవర్గాల్లోనే పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయించుకుని సమావేశాలకు సిద్దం అవుతున్నారు. శాసనసభకు వచ్చే మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తప్పనిసరిగా కోవిడ్ 19 నెగటివ్ రిపోర్టు చూపించిలోనికి ప్రవేశించాలని ఇప్పటికే స్పీకర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులంతా కరోనా పరీక్షలు చేయించుకుని సిద్దమవుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News