Friday, April 26, 2024

ఎంఎల్‌సి ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

Telangana MLC Election Results 2021

హైదరాబాద్: నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల కౌటింగ్ గురువారం కొనసాగుతుంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. అందులోనూ టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. రెండు రౌండ్లలో కలిపి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 31,987, తీర్మార్ మల్లన్న 24,116ఓట్లు, కోదండరామ్ కు 18,528 ఓట్లు, బిజెపి ప్రేమేందర్ రెడ్డికి 13,284 ఓట్లు, కాంగ్రెస్ రాములు నాయక్ కు 7,598 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్లలో కలిపి టిఆర్ఎస్ 7,871 ఓట్ల ఆధిక్యం ఉంది. రెండు రౌండ్లలో 6,160 చెల్లని ఓట్లు  ఉన్నాయి. రెండో రౌండ్ లో 55,991 ఓట్లు లెక్కించారు. అటు, రంగారెడ్డి- హైదరాబాద్- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ కొనసాగుతుంది. టిఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. తొలి రౌండ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 17,438 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం రెండ్ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 1,054 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Telangana MLC Election Results 202 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News