Home తాజా వార్తలు స్థానిక ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు ప్రారంభం

స్థానిక ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు ప్రారంభం

third phase Parishad election nominations

 

 

మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం  ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది.  రంగారెడ్డి స్థానానికి రాజేంద్ర నగర్‌లోని వెటర్నరి కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అలాగే నల్లగొండకు అదే జిల్లాలోని తిప్పర్తి మండలం, దుప్పలపల్లి గోదాంలో ఓట్లను లెక్కిస్తున్నారు. కేవలం పది గంటలోపే ఎవరు ఎంఎల్‌సిగా గెలుపొందనున్నారో తెలుస్తుంది.

ఈ నెల 31వ తేదీన వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక కోటా ఎంఎల్‌సి స్థానాల ఉప ఎన్నికలకు ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. మూడు ఎంఎల్‌సిల పరిధిలో 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2793 మంది ఓటర్లకు గాను 2753 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా చూస్తే 98.55 శాతం ఓటింగ్ నమోదైంది. రంగారెడ్డి స్థానానికి 806 మంది ఓటర్లు ఉండగా, 797 మంది ఓటు (98.88 శాతం) వేశారు. నల్లగొండ స్థానానికి 1085 మంది ఓటర్లు ఉండగా, 1073 మంది (98.89 శాతం), వరంగల్ స్థానానికి 902 మంది ఓటర్లకు గాను 883 (97.89 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్ స్థానానికి టిఆర్‌ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డితో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. నల్లగొండలో టిఆర్‌ఎస్ తరపున తేరా చిన్నపురెడ్డి, కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ, రంగారెడ్డి స్థానానికి టిఆర్‌ఎస్ నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పోటీ చేశారు.

Telangana MLC Votes counting today