Thursday, April 25, 2024

బిజెపి నాయకులు కెసిఆర్ ను చూసి భయపడుతున్నారు: కడియం

- Advertisement -
- Advertisement -

 Kadiam Srihari

 

హైదరాబాద్: తెలంగాణ మోడల్ గుజరాత్‌ను తలదన్నేలా ఉందని ఎంఎల్‌సి కడియం శ్రీహరి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో శ్రీహరి మాట్లాడారు. తాము తెలంగాణ మోడల్‌ను ప్రచారం చేసుకోలేదన్నారు. గుజరాత్ మోడల్ అంటూ పిఎం మోడీ ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. దేశంలో దళితబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. తెలంగాణ పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నామని, సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందని కొనియాడారు. విభజన హామీల అమలులో కేంద్రం విఫలమైందని, విభజన చట్టం రూపొందించేటప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని కడియం విమర్శించారు. అన్ని రకాల కేంద్ర విద్యా సంస్థలు ఎపిలో నెలకొల్పేలా చట్టంలో పొందుపరిచారని, తెలంగాణకు ఇచ్చిన ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదన్నారు. కేంద్రం ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. తెలంగాణకు ఒక కేంద్ర మంత్రి ఉన్నారని, కానీ ఆయన కెసిఆర్ ప్రభుత్వాన్ని తిట్టడమే పని పెట్టుకున్నారని చురకలంటించారు. కేంద్రమంత్రులు, బిజెపి నాయకులు కెసిఆర్ ను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కడియం సవాలు విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News