Home జాతీయ వార్తలు లోక్‌సభలో మన ఎంపిల ప్రమాణం

లోక్‌సభలో మన ఎంపిల ప్రమాణం

telangana Mps

న్యూఢిల్లీ : లోక్‌సభలో మంగళవారంనాడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సభ్యులు ఎంపిలుగా ప్రమాణ స్వీకా రం చేశారు. టిఆర్‌ఎస్ నుంచి 9 మంది, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బిజెపి నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒక ఎంపి ప్రమాణస్వీకారం చేశారు. మొదట పెద్దపల్లి ఎంపి వెంకటేశ్ నేతకాని ప్రమాణం చేశారు. ఆ తర్వాత వరుసగా బండి సంజయ్ కుమార్, అరవింద్ ధర్మపురి, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, డాక్టర్ రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటిరాములు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు ప్రమాణం చేశారు. వీరిలో వెంకటేశ్ నేతకాని, బండి సంజయ్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పోతుగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పసునూరి దయాకర్, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు తెలుగు భాషలో ప్రమాణస్వీకారం చేశారు.

అరవింద్ ధర్మపురి, రంజిత్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంగ్లీష్ భాషలో ప్రమాణం చేయగా, బీబీ పాటిల్, అసదుద్దీన్ ఓవైసీ హిందీ భాషలో ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డి తన సెల్‌ఫోన్‌లో ప్రమాణ పత్రాన్ని చూస్తూ చదివారు. ప్రమాణం చేసిన తర్వాత చాలా మంది ఎంపిలు జై తెలంగాణ నినాదాలు చేశారు. బిజెపి ఎంపిలు భారత్ మాతా నినాదాలు చేశారు. ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసి ప్రమాణం చేయడానికి వస్తుండగా బిజెపి ఎంపిలు భారత్ మాతా కీ జై నినాదాలు పెద్ద పెట్టున చేశారు. దానికి సమాధానంగా అసద్ మరింత బిగ్గరగా నినాదాలు చేయండని సైగలు చేశారు. ప్రమాణం ముగిసిన తర్వాత అసదుద్దీన్ జై భీమ్.. జై మీమ్.. అల్లా హో అక్బర్ అంటూ నినదించారు.

telangana Mps oath in 17th lok sabha