Friday, April 19, 2024

ఎన్నికల సరళిని తెలుసుకుంటున్న మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా ఎన్నికల కౌంటింగ్ సరళిని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కెటిఆర్‌ తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ పలు స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం దూసుకుపోతుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు కొనసాగుతున్న కౌంటింగ్ లో కొన్ని చోట్ల మినహా దాదాపుగా టిఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 10గంటల వరకు జరిగిన కౌంటింగ్ లో పెద్దపల్లి, వర్ధన్నపేట, మహబూబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్‌ విజయం సాధించింది. తుది ఫలితాల అనంతరం సాయంత్రం  టిఆర్‌ఎస్‌ ఎంపిలు, ఎంఎల్ సిలతో మంత్రి కెటిఆర్ భేటీ కానున్నారు.

telangana municipal election results live updates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News