Home తాజా వార్తలు ఇంటిని శుభ్రం చేసుకున్న కెటిఆర్

ఇంటిని శుభ్రం చేసుకున్న కెటిఆర్

KTRహైదరాబాద్ : పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుని , దోమల నివారణ మందులను పిచికారి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత కోసం రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు ఆయన తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. మున్సిపల్ అధికారులు సీజనల్ వ్యాధులపై ప్రజల్లో చైతన్యం తెచ్చి, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గడపగడపకు వెళ్లి సీజనల్ వ్యాధులపై ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన పేర్కొన్నారు. దోమల ద్వారా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

Telangana Municipal Minister KTR Clean His House