Home రాష్ట్ర వార్తలు వృద్ధిలో మనమే మిన్న

వృద్ధిలో మనమే మిన్న

kcrస్థిరంగా 12% వద్ద కొనసాగుతోంది, ఇది జాతీయ రేటు కంటె ఎక్కువ, 2019లో రూ.1,60,000 కోట్లు   దాటనున్న రాష్ట్ర బడ్జెట్ : కెవి రంగారెడ్డి జయంతి సభలో సిఎం కెసిఆర్

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు కొండా వెంకట రంగారెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రక టించారు. ప్రభుత్వ ఖర్చులతో మంచి కూడలిలో విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సిఎం తెలిపారు. ఎవి కళాశా ల ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన కెవి రంగారెడ్డి 125వ జయంత్యు త్సవాల్లో సిఎం ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, మాజీ న్యాయమూర్తు లు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, జస్టిస్ గోపాల్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, కె.ప్రతాపరెడ్డి, ఎంపిలు కొండా విశ్వేశ్వ రరెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా సిఎం మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రతో విలీనం జరిగితే ఉండే కష్ట నష్టాలేమిటో ఆనాడే ఊహించారని, రంగారెడ్డి ఆత్మకథ చదివి తేనే ఆయన దూరదృష్టి అర్థమవుతుందని అన్నారు. పుస్తకాల్లో రాసినటుగా నే అన్యాయం జరిగిందని, ప్రత్యేక రాష్ట్రంగా ఉం టే కలిగే లాభమేంటో కూడా చెప్పాడన్నారు. ఉద్యమ సమ యంలో అవే విషయాలను సభల్లో చెప్పానని, ప్రజల్లో అవగా హన కోసం రంగారెడ్డి ఆత్మకథ పుస్తకాలను వేలాది పంచామ ని కెసిఆర్ గుర్తుచేశారు. కె.వి.రంగారెడ్డి ఆలోచనలు, ఆశయా లకు అనుగుణంగా అద్భుత తెలంగాణను ఆవిష్కరించే దిశలో పునరంకితమవుతామని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ చరిత్రలోని ప్రముఖులను గౌరవించుకోవాల్సిన అవసరముం దని, రంగారెడ్డితో పాటు రాజ్‌బహదూర్ వెంకటరామిరెడ్డి వం టి వారు ఈ ప్రాంతం కోసం కృషిచేశారన్నారు. ఆరు మాసాల ఆదాయ, వ్యయాలపై ఇటీవలే సమీక్షించానని, తెలంగాణ ఆర్ధికవృద్ధి 12 శాతం స్థిరంగా కొనసాగుతుందని, దేశవ్యాప్త వృద్ధి కంటే ఎక్కువే ఉందన్నారు. ఇదే వృద్ధిరేటు కొనసాగితే 2019లో బడ్జెట్ రూ.1,60,000 కోట్లు దాటుతుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారన్నారు. విద్యుత్ రంగంలో కష్టాల్ని అధిగమించామని, మరో రెండేళ్లలో కోతలు లేకుండా నాణ్యమై న విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటిలోపలే నల్లా ఏర్పాటు చేసి, తాగునీరు అందించే బృహ త్తర యత్నం ఫలితాలు రెండున్నరేళ్లలో వస్తాయని అన్నారు. ఈ పథకాన్ని ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు అభినందించి, ఆచరించడానికి ఆసక్తి చూపుతున్నారని సిఎం తెలిపారు. బీహార్‌లో గవర్నర్ ప్రసంగంలో ‘తెలంగాణలో లాగా ఇంటింటికీ మంచినీరు అందిస్తామని’ చెప్పారని, ఇది మనకు గర్వకారణమని అన్నారు.
త్వరలోనే సమగ్ర జలవిధానం
సమైక్య రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ కాగితాలపైనే ఉన్నాయని, ఇవి నీరొచ్చేవి కావని కెసిఆర్ చెప్పారు. అందుకే వాటన్నింటినీ సమీక్షించి, సరికొత్త డిజైన్లు రూపొందిస్తున్నా మన్నారు. తెలంగాణ సమగ్ర జలవిధానాన్ని ప్రజలకు చెబు తామని, ఎన్నికల కోడ్ ఉన్నందునే జలవిధాన ప్రకటనలో ఆలస్యమవుతుందని సిఎం వివరించారు. ఎత్తైన ప్రాంతాలకు కూడా నీరందిస్తామని హామీనిచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేసీఆర్ వెల్ల డించారు. కొండా వెంకట రంగారెడ్డి ఆశయాలకు అనుగు ణంగానే సంక్షేమ రంగంలో దేశంలోని మరే రాష్ట్రంలో లేనట్లు గా రూ.34,000 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు.
బూర్గుల ఢిల్లీ పర్యటనతో పరిస్థితి తారుమారు :
జస్టిస్ నర్సింహారెడ్డి
ప్రత్యేక రాష్ట్రంగా ఉంటేనే తెలంగాణ బాగుపడుతుందని అం దరికంటే ముందుగా ఊహించిన వ్యక్తి కొండా వెంకటరంగా రెడ్డి అని హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎల్.న ర్సింహారెడ్డి కొనియాడారు. మొదటి నుంచి తెలంగాణను ఎవరో ఒకరు వంచిస్తూనే వచ్చారని అన్నారు. ఆనాటి హైదరా బాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు డిల్లీ పర్య టన కారణంగా తెలంగాణ 60 ఏళ్ల వంచనకు గురయిందని అన్నారు. అప్పటి వరకు అన్ని రకాలుగా తెలంగాణను ప్రత్యే కంగా కొనసాగించేలా ప్రయత్నించి, విజయం సాధిస్తున్న ద శలో బూర్గుల డిల్లీ పర్యటనతో అంతా తారుమారయ్యిందని చరిత్రను వివరించారు. పోరాటాల ఫలితంగా వచ్చిన తెలం గాణ భవిష్యత్ బంగారం చేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశా రు. ఇందుకోసం పొరపాట్లకు తావివ్వకుండా ప్రణాళికలు ఉండాలన్నారు. నిష్కళంక ప్రవర్తన, న్యాయసమ్మతమైన ధనా ర్జన, శ్రమానుసారం మానవసేవలను కేవి రంగారెడ్డి ఆచరించి చూపారని, న్యాయవాదంలో నిష్ణాతులుగా పేరుతెచ్చుకున్నా రని అన్నారు.
తొలి రోజు నుంచే పోరాటాలు : విశ్వేశ్వర్‌రెడ్డి
చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడు తూ సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి మరెన్నో పోరాటా లు చేయాలన్నారని, అదేవిధంగా తొలి రోజే పోలవరం ముం పు పేరుతో ఏడు మండలాల కోసం పోరాటం చేశామని అన్నా రు. ఇంకా నీళ్లు, కరెంటు, హైకోర్టు విభజన.. ఇలా మా పోరా టం కొనసాగుతూనే ఉందన్నారు. కెవి రంగారెడ్డి ఆశయాలకు బంగారు తెలంగాణను సిఎం సాకారం చేస్తారని విశ్వాసం వ్యక్తపరిచారు. కెవి రంగారెడ్డి నుంచి జయశంకర్, కెసిఆర్ వరకు తెలంగాణ అభివృద్ధికి పరితపించారని వివరించారు.