Home రాష్ట్ర వార్తలు రాబడిలో రాష్ట్రం నెంబర్ వన్

రాబడిలో రాష్ట్రం నెంబర్ వన్

గత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయ వృద్ధి 17.82% : కాగ్ వెల్లడి 

                       clean-money

హైదరాబాద్ : ఆదాయాభి వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ప్రధానమైన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 17.82 శాతం వృద్ధి రేటు సాధించగా, అన్ని రకాల పన్నుల ఆదా యంలో 17.81 శాతం వృద్ధి రేటు సాధించిం ది. ప్రధానమైన సేల్స్ టాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ – రిజిస్ట్రేషన్‌ల ద్వారా 17.82 శాతం వృద్ధి రేటు సాధించింది. 2015-16 సంవత్సరంలో మా ర్చి నుంచి ఫిబ్రవరి వరకు రూ.33,257 కోట్ల ఆదాయం రాగా, ఇదే సమయానికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.39,183 కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ప్రధాన పన్నుల ద్వారా 17.82 శాతం ఆదాయ వృద్ధి రేటును పెంచుకోగ లిగిందని కాగ్ అధికారికంగా వెల్లడించినట్టు సిఎం కార్యాలయం సిపిఆర్‌ఒ ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఇకపై మూడు పన్నులతో పాటు రవాణా రంగం, ఇతర మార్గాలన్నీ కలుపుకుని 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.36,130 కోట్ల రూపాయల ఆదాయం రాగా, 2016-17లో రూ.42, 564 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రం 17.81 శాతం వృద్ధి రేటు సాధించగలిగింది. ఈ రెండు విభాగాల్లోనూ తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌గా నిలిచింది. ఎస్.ఓ.ఆర్., ఎస్.ఓ.టి.ఆర్ రెండు విభాగాల్లోనే దాదాపు 17 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించడం పట్ల సిఎం సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణ ధనిక రాష్ట్రమవుతుందని ఉద్యమ సమయంలోనే తాను వాదించానని, ఈ మూడేళ్ల సమయంలో ఈ విషయం అనేక సార్లు రుజువైం దని సిఎం అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గకుండా, పెరుగుదల సాధించడం గొప్ప విశేషమని సిఎం అన్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారులకు, ప్రజలకు సిఎం కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఆదాయ వృద్ధి రేటులో అనుకున్న పెరుగుదల వస్తున్నందువల్ల రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకుపోతామని సిఎం ప్రకటించారు.