Friday, April 19, 2024

శ్రీశైలం నీటిని తరలిస్తే తీవ్రంగా స్పందిస్తాం

- Advertisement -
- Advertisement -

Srisailam-water

 ఈ అక్రమ తరలింపును అడ్డుకుంటాం
అపెక్స్ కమిటీ తీర్మానం లేనిది ఆంధ్ర కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుంది
సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం
ఏపి సర్కార్‌ను హెచ్చరించిన తెలంగాణ మంత్రులు

హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు ఆంధ్ర గండికొడుతూ మరోసారి జల దోపిడికి తెర తీసింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని పూర్తిగా తరలించేందుకు కుట్ర పూరితమైన ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం నుంచి రోజుకు వేలాది క్యూసెక్కుల నీటి తరలించేందుకు అక్కడి ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఇవ్వడంతో శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడిన తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఏపి సిఎం జగన్ స్నేహంగా ఉంటూనే ఈ విధానానికి పాల్పడటంతో రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం మండి పడుతున్నాయి.

ఎట్టి పరిస్థితుల్లో శ్రీశై లం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర జల దోపిడిని అడ్డుకుంటామని సిఎం కెసిఆర్ చేసిన ప్రకటనతో పానిపట్టు పోరాటానికి రాజ్యాంగపరమైన ఆయుధ సంపత్తికి పదు ను పెడుతున్నారు. శ్రీశైల నుంచి భారీ మోటార్ల ద్వారా కృష్ణా నీటిని కుడి కాల్వలోకి ఎత్తిపోయడంతో పాటు పోతిరెడ్డిపాడుకు తరలిస్తారు. ఒకవైపు భూగర్భతూములు, మరోవైపు ఎత్తిపోతలతో శ్రీశైలం పూర్తిగా ఆవిరైపోతుంది. తెలంగాణకు నిబంధనల మేరకు కూడా నీరు లభించే పరిస్థితి ఉండదు.

నాడు వైఎస్ ఆర్ నేడు వైఎస్ జగన్

శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడిన ఆనాటి కరువు జిల్లా మ హబూబ్‌నగర్ జల ప్రయోజనాలను ఎండగడుతూ ఆనా టి సిఎం వైఎస్‌ఆర్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 4 భూగర్భతూములు నిర్మించి 44 టిఎంసిల నీటిని పోతిరెడ్డి పాడుకు తరలించారు. విపక్షాలు అడ్డుకున్నా, శాసనసభలో ప్రతిపక్షాలు పోరాటం చేసినా, తెలంగాణ వాదు లు ఉద్యమించినా లెక్కచేయకుండా వైఎస్‌ఆర్ శ్రీశైలం జలాలను పోతిరెడ్డి పాడుకు తరలించారు. ప్రస్తుతం ఆయన తనయుడు సిఎం జగన్ ఏకంగా అదనంగా 10 భూగర్భ తూములు నిర్మించి 80వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు పక్కా ప్రణాళికతో నిధులు విడుదల చేశారు.

విభజనబిల్లు స్ఫూర్తికి వ్యతిరేకం:మంత్రి హరీష్

నీటి వాటాలపై రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లులో స్పష్టంగా ఉంది. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల అవసరాలు తీరందే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే హక్కు ఆంధ్రకు ఎవరిచ్చారని మంత్రి హరీష్ రావు ప్రశ్ని ంచారు. కృష్ణాజలాలపై ఎపికి 512 టిఎంసిల వాటా ఎక్కడిదని ఆయన నిలదీశారు. పోతిరెడ్డి పాడుకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించినప్పుడే నిరసనగా టిఆర్‌ఎస్ శాసనసభ్యులం రాజీనామాలు చేశాము.

ఇప్పుడు రోజుకు 3టిఎంసి తరలిస్తామంటే తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. కొత్తగా నీటిని వినియోగంలోకి తీసుకురావాలం టే అపెక్స్ కమిటీలో చర్చించాల్సి ఉంటుంది. అ లాంటప్పుడు ఎలాంటి చర్చలు లేకుండా అక్రమంగా శ్రీశైలం నుంచి ఆంధ్ర రోజుకు 80వేల క్యూసెక్కుల నీటి ని తరలించుకుపోతే తెలంగాణలోని కృష్ణాపరివాహక ప్రాంతా ల పరిస్థితి ఏమిటీ, కృష్ణానదీపై ఆధారపడిన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటని ఆయన ఆంధ్రను ప్రశ్నించారు.

అడ్డుకుంటాము : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్ నీటి ప్రయోజనాలు దెబ్బతీస్తే సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర సర్కార్ అక్రమంగా నీటిని తరలిస్తే మహబూబ్‌నగర్ ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాంతాల ప్రాజెక్టులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఎపి విధానాలను అడ్డుకుంటాం : జగదీష్ రెడ్డి

పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థం పెంచితే తెలంగాణ జల ప్రయోజనాలకు తీరని నష్టం ఏర్పడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ నీటి ప్రాజెక్టులకు కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అయితే ఎట్టిపరిస్థితులోనూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ప్రాజెక్టును అడ్డుకుంటారని ప్రజల ఆందోళన పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం ముందు మహారాష్ట్ర ప్రభుత్వంతో దశలవారిగా చర్చలు జరిపి ఆ రాష్ట్రానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా నిర్మాణ పనులు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే సిఎం జగన్ తెంలగాణతో స్నేహంగా ఉంటూనే ఎలాంటి సంప్రదింపులు లేకుండా తెలంగాణకు చెందిన నీటి వాటాలను గండికొడుతూ ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ లో న్యాయ లభించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఊరుకునే ప్రసక్తే లేదు : కర్నె ప్రభాకర్

తెలంగాణకు చెందాల్సిన కృష్ణా, గోదావరిలోని నీటి చుక్కను ఆంధ్ర ప్రదేశ్ అక్రమంగా తరలించినా సహించే ప్రసక్తే లేదని ప్రభుత్వ విప్ కర్నెప్రభాకర్ హెచ్చరించారు. తెలంగాణ పోరాటంలో నీటి వాటాల అంశం ప్రధాన భూమిక పోషించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం మాప్రాజెక్టులు మేము నిర్మించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటుంటే తిరిగి ఆంధ్ర జల దోపిడికి ప్రయత్నిస్తే ప్రజలు సహించరని ఆయన ఘాటుగా స్పందించారు.

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తక్ష ణం స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లి శ్రీశైలం నీటిని తరలించేందుకు ఆంధ్ర పన్నిన కుట్రను అడ్డుకుంటామని చెప్పారు. అక్రమంగా నీటిని ఆంధ్ర తరలిస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అనవసరమైన రాజకీయాలతో బిజెపి, కాంగ్రెస్ లబ్ది పొందాలనే కుటిల ప్రయత్నాలను మానుకోవాలని హితవు చెప్పారు.

న్యాయంగానే నిర్మిస్తున్నాం , ఎపి మంత్రి అనిల్‌కుమార్

కృష్ణాజలాల్లో ఎవరివాటాలు వారికి ఉన్నాయని ఎపి నీటిపారుదల శాఖమంత్రి అనిల్‌కుమార్ చెప్పారు. తక్కువ రోజుల్లోనే వరదనీటిని తీసుకువెళ్లేందుకు 44వేల నుంచి 80 వేల క్యూసెక్కుల వరకు సామర్థం పెంచుతున్నామన్నారు. ప్రకా శం, నెల్లూరు జిల్లాలకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తెలంగాణకు ఆంధ్ర నష్టం చేస్తున్నట్లు మాట్లాడటం సరైంది కాదన్నారు. అయితే వాటాల అంశంపై కానీ, సాంకేతిక అంశాలపై కానీ ఆయన స్పందించకపోవడం గమనార్హం.

Telangana opposed AP move lifting Srisailam water

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News