Home తాజా వార్తలు సౌదీలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు తెలంగాణ వాసులు మృతి

సౌదీలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు తెలంగాణ వాసులు మృతి

Road Accident

 

హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ వాసులు మృతిచెందారు. ద్విచక్రవాహనంపై పనులకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో మరణించినవారు మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం రొటిగూడేనికి చెందిన ఉప్పు మల్లేశ్‌(40), దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన రాజు(24)లుగా గుర్తించారు. వీరు ఉపాధి కోసం మూడు సంవత్సరాల క్రితం సౌదీ వెళ్లారు. రాజు, మల్లేశ్ లు  పొట్టకూటికోసం సౌదీ వెళ్లి మృత్యువాత పడడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Telangana people died in Saudi road accident