Home కరీంనగర్ 23న కానిస్టేబుల్ అభ్యర్థుల రాతపరీక్ష

23న కానిస్టేబుల్ అభ్యర్థుల రాతపరీక్ష

Police8537 మంది అభ్యర్ధులకు అన్ని ఏర్పాట్లు
కరీంనగర్‌లో 17 పరీక్షాకేంద్రాలు
కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి

మన తెలంగాణ/కరీంనగర్ క్రైం: పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ కాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ళు(సివిల్/ఎ.ఆర్/టి.ఎస్.పి.ఎస్.పి/ఎస్.పి.ఎఫ్, ఎస్.ఎఫ్.ఒ) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ రాతపరీక్ష ఈ నెల 23 న జరగనున్నది. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల రాత పరీక్ష కోసం కరీంనగర్‌లో 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.కరీంనగర్‌లోని వాగేశ్వరీ డిగ్రీ కళాశా ల, అపూర్వ డిగ్రీ కళాశాల, వాణినికేతన్ డిగ్రీ అండ్ పిజి కళాశాల, ప్రభుత్వ మహిళ డిగ్రీ అండ్ పిజి కళాశాల, శ్రీచైతన్య డిగ్రి కళాశాల, ఎస్‌ఆర్‌ఎం డిగ్రీ అండ్ పిజీ కళాశాల,కిమ్స్ వివేకానంద డిగ్రీ అండ్ పిజి కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ అండ్ పిజి కళాశాల, అల్ఫోర్స్ మహిళ డిగ్రి అండ్ పిజి కాలేజ్, సహజ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రిలిమినరీ రాత పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు కొనసాగుతుంది. ఒక గంట ముందు నుండి పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యం అయిన పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగదు. రాత పరీక్షకు 8,534 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. హాల్‌టికెట్లు లేకుండా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించడం జరుగదు. విధిగా హాల్ టికెట్లను పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి. అభ్యర్థులు పరీక్ష రాయడం పూర్తయిన పరీక్ష సమయం వరకు బయటకు పంపడం జరగదు. మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రవేశం నిషేధం. అభ్యర్థులు ఎలాంటి విలువైన వస్తువులు వెంటతీసుకురావద్దు. బయోమెట్రిక్ విధానం ద్వారా తనిఖీ చేయడం జరుగుతుంది. ఎలాంటి సాంకేతిక లోపాలున్న తిరస్కరిస్తారు. కాళ్లు, చేతులకు మెహాంది, ఇంక్ (పైపూతలు) శరీరానికి లేకుండా చూసుకోవాలి. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయి. నియమ నిబంధనలు ఉల్లంఘించే వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు హాల్‌టికెట్లను భద్రపరుచుకోవాలి. అభ్యర్థులు ఎలాంటి సందేహాలకు గురవ్వకుండా ఉండేందుకు గాను ఒకరోజు మందుగానే జిల్లా కేంద్రానికి విచ్చేసి పరీక్షా కేంద్రాలు, దారులు చూసుకోవాలని సూచించారు.