Friday, March 29, 2024

కార్డన్‌సెర్చ్‌లో ఆధార్ అడగడమేంటి?

- Advertisement -
- Advertisement -

Asaduddin-Owaisi

 

127 మందికి ఉడాయ్ పౌరసత్వ నోటీసుల ఉదంతంలో పోలీసులపై ఆగ్రహిస్తూ ఎఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : కార్డన్‌సెర్చ్‌లో ఆధార్ చూపమని అడగటం ఏంటని, ఆధార్ గురించి అడిగే హక్కు తెలంగాణ పోలీసులకు లేదని ఎఐఎంఐఎం చీఫ్ బుధవారం నాడు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మంది కి పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీసులు జారీ చేయడంపై ఎఐఎంఐఎం చీఫ్, ఎంపిఅసదుద్దీన్‌ఓవైసీఉడాయ్, తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోటీసులు అందుకున్న 127 మందిలో ముస్లింలు, దళితులు ఎంతమంది ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఆధార్‌సంస్థ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని, సరైన ప్రామాణికాలు అనుసరించకుండానే పక్షపాతపూరితంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. నోటీసుల్లో పౌరసత్వ వెరిఫికేషన్ అనే పదాన్ని చేర్చారని, కానీ ఆధార్‌వ్యాలిడిటీ గురించి ప్రస్తావించలేదని, ఈ నోటీసును జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్‌ను ఉడాయ్ వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Telangana police have no right to inquire about Aadhaar
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News