Wednesday, April 24, 2024

దేశంలో తెలంగాణ పోలీస్ నంబర్ వన్

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పోలీస్‌శాఖ దేశంలోనే నంబర్ వన్ అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బేగంపేటలోని ఐటిసి కాకతీయ హోటల్‌లో సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ లోగోను హోంమంత్రి గురువారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలో తెలంగాణ పోలీస్‌శాఖ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. పోలీస్‌శాఖ పటిష్టత కోసం రూ. 700 కోట్లతో అనేక అభివృద్ధి పనులకు చేస్తున్నట్లు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీస్‌తో నేరాలు తగ్గుముఖం పట్టాయని, దీంతో రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీల సంఖ్య సైతం తగ్గిందన్నారు. నగరంలో, రాష్ట్రంలో గుడుంబా వ్యాపారం కనుమరుగైందన్నారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తి కానుందని హోంమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలకు తెరతీసిందన్నారు. తీవ్ర కేసుల్లో అనతికాలంలో దర్యాప్తు పూర్తి దోషులకు శిక్షల పడేలా పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయన్నారు. ప్రజల సహకారంతో పోలీసులు ముందుకు సాగుతున్నారని, దీంతో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా నిలవడం అభినందనీమన్నారు. కార్యక్రమంలో నగర సిప అంజనీకుమార్, అడిషనల్ సిపి క్రైం శిఖాగోయల్, సీనియర్ ఐపిఎస్ అధికారులు అనీల్‌కుమార్, చౌహాన్, తరుణ్‌జోషి, ఎఆర్ శ్రీనివాస్, రమేష్, విశ్వప్రసాద్, హెచ్‌సిఎస్‌సి సెక్రటరీ భరణీఅరోల్, ఎన్‌సిసి అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండి నారాయణరాజు, అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియా యార్లగడ్డ, సినీ నిర్మాత దిల్ రాజు తదితర అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana Police is no.1 in the country: Mahmood Ali

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News