*నేరం చేస్తే దొరికిపోతామన్న నమ్మకాన్ని నేరగాళ్లలో కల్పించిన ఘనత తెలంగాణ పోలీసులదే
*రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టం
*సూర్యాపేట జిల్లాలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయ పనులను పరిశీలించిన డీజీపీ మహేందర్‌రెడ్డి
*ఫెండ్లీ పోలీస్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రావు
మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి/సూర్యాపేట
దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థ పటిష్టంగా, నాణ్యతా ప్రమాణాలు కలిగిన వ్యవస్థగా నేడు పేరొందుతుందని రాష్ట్ర డిజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో నేరం చేస్తే వెంటనే దొరికిపోతామన్న భయం నేరగాళ్లలో కల్పించామని పేర్కొన్నారు. నేరం చేస్తే తప్పక శిక్ష పడుతుందనే నమ్మకాన్ని నేరగాళ్లలో పోలీసు వ్యవస్థ కల్పించిందని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును డీజీపీ అభినందించారు. తెలంగాణా రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా, శాంతి భద్రతల నిలయంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మన తెలంగాణ/సూర్యాపేట: దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థ పటిష్టం గా, నాణ్యతా ప్రమాణాలు కలిగిన వ్యవస్థగా నేడు పేరొందుతుందని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో నేరం చేస్తే వెంటనే దొరికి పోతామన్న భయం నేరగాళ్లలో కల్పించామని పేర్కొన్నారు. నేరం చేస్తే తప్పక శిక్ష పడుతుందనే నమ్మకాన్ని నేరగాళ్లలో పోలీసు వ్యవస్థ కల్పించిందని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ఎస్పీ జిల్లా కార్యాలయ పనుల పరిశీలనలో భాగంగా ఆయన సోమవారం జిల్లా కేంద్రా నికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ప్రపం చంలోనే తెలంగాణ పోలీసు వ్యవస్థను పటిష్ట వ్యవస్థగా రూపుదిద్దుకునే విధం గా కృషి చేస్తున్నట్లు వివరించారు.రాష్ట్రంలో పెట్టుబడు లు వచ్చి పరిశ్రమలు నెలకొల్పి తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా లన్న ఆకాంక్షతోనే పోలీసు వ్యవస్థ తాపత్రాయ పడుతుం దనే అభిప్రాయం వ్యక్తం పరిచారు. తెలంగాణలో నిర్భయంగా జీవించే వాతా వరణాన్ని ప్రస్తుత పోలీసు వ్యవస్థ కల్పించిందని చెప్పారు. ఈ ఏడాదిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి పోలీసింగ్ వ్యవస్థను నంబర్ వన్ వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తు న్నట్లు వివరించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ గౌరవంగా స్వాగ తం పలకాలని సూచించారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తే పోలీసు వ్యవస్థపై వారికి గౌరవం పెరుగుతుందన్నారు. ప్రజల మనో భావాలకనుగుణంగా పోలీసు సేవలను అం దించాలని సూచిం చారు. ఈ సందర్భంగా నూతన భవన నిర్మా ణ మ్యాప్‌ను పరిశీ లించి జిల్లా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్‌ను వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఎస్వీ కాలేజ్‌లో ఏర్పా టు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న కలెక్టర్ సురేంద్ర మోహన్, ఎస్పీ ప్రకాశ్‌జాదవ్‌లు పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట ఐజి స్టీ ఫెన్ రవీంద్ర, ఏఎస్పీ ఇస్మాయిల్, డిఎస్పీ నాగేశ్వరరావు, సిఐ లు శివశంకర్, ప్రవీణ్ కుమార్, ఎస్సైలు తదితరులు ఉన్నారు.
ఎస్పీకి డిజిపి అభినందన ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో ప్రజలకు సేవలందిస్తున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. పోలీస్ జిల్లా విభాగాలు, కమీషనరేట్‌ల పర్యటనలో భాగం గా డీజీపీ సోమవారం నల్లగొండ పోలీస్ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. నల్లగొండ ఎస్పీ శ్రీనివాసరావు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జిల్లా పోలీస్ కేంద్రంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ఐటి సెల్ కేంద్రాలను డిజిపి మహేందర్‌రెడ్డి, ఐజి స్టీఫె న్ రవీంద్ర, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావులు ప్రారంభించారు. అనంతరం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలీస్ అధికారులతో మహేందర్‌రెడ్డి సమా వేశమయ్యారు. నేరస్థుల సర్వే, క్రైమ్ రేటింగ్‌పై సమీక్షించారు. ఈ సంద ర్భం గా డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఐటి సెల్ నిర్వహణ, ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు అద్భుతమని ప్రశంసించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రీతిలో ప్రజ లకు సేవలందిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను సమర్ధవంతంగా నిర్వహిస్తు న్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును డిజిపి అభినందించారు. తెలంగాణా రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా, శాంతి భద్రతల నిలయంగా మార్చేందుకు కృషి చేస్తున్నా మన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, సూర్యాపేట ఎస్పీ ప్రకాశ్‌జాదవ్‌లు పాల్గొన్నారు.