Friday, March 29, 2024

దేశానికే రోల్ మోడల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రా ష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి రోల్ మోడల్‌గా ఉందని, రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయానికి 24×7 నిరంతర విద్యుత్తు దేశానికి ఆదర్శంగా ఉందని దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సిఎండిలు, డైరెక్టర్లు కొనియాడారు. తెలంగాణ సిఎం కెసిఆర్ విజన్, విద్యుత్ ఇంజినీర్స్ కృషితోనే ఇ దంతా సాధ్యమైందని వారు అభినందించారు. అన్నింటికీ మించి తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్స్ సమష్టి కృషి వల్లనే ఇంతటి విజ యం సాధించారని వారు కీర్తించారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు కూడా తెలంగాణ విద్యుత్ వ్యవస్థలు ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ని రంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ కూ డా విద్యుత్ బిల్లుల్లోనూ తక్కువగానే ఛార్జ్ చేయ డం చాలా గొప్ప విషయమని వారు అభినందలు తెలిపారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న దక్షిణాది రా ష్ట్రాల విద్యుత్ సంస్థల సిఎండిలు, లెక్టర్లు, అధికారులు ఈ మేరకు శుక్రవారం విద్యుత్ సౌధలో సిఎండి ప్రభాకర్ రావుతో సమావేశమయ్యారు.

ఎన్నో విషయాల్లో ఆదర్శంగా ఉన్న తెలంగాణ ను చూసి తాము అమలు చేసేందుకు యత్నిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ, నూతన సబ్‌స్టేషన్లు, నూతన సాంకేతిక పరిజ్ఞానం,అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ పై దక్షిణాది రాష్ట్రాల సిఎండిలు, డైరెక్టర్‌లు ఈ మేరకు అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు. ఇంత తక్కువ కాలంలో విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సిఎండి ప్రభాకర్ రావుకు, వారు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ప్రో త్సాహకాలు అందించడం వల్లనే ఇదంతా సా ధ్యమైందని వారు అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపుతోనే విద్యుత్ వ్యవస్థలను రూపొందించారని, అలాగే నగరంలో ఏర్పాటు చేసిన పవర్ రింగ్ మెన్ వ్యవస్థ కూడా అద్భుతంగా ఉందని దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సిఎండిలు, డైరెక్టర్లు కొనియాడారు. తెలంగాణలో నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా తాము చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు. నగరాల్లో రాయదుర్గం వంటి సబ్ స్టేషన్లు చాలా అవసరం అని పేర్కొన్నారు. 15,467 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ ను కూడా తెలంగాణ అధిగమించడం గొప్ప విషయమన్నారు.

విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ : ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు
సీఎం కెసిఆర్ ముందు చూపుతో ఇవాళ పర్ క్యాపిట విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని టిఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర రావు అన్నారు. దేశానికి సిఎం కెసిఆర్ పాలన ఆదర్శమని, ఆదాయం లో కూడా నెంబర్ వన్ తెలంగాణనే నిలుస్తోందన్నారు. సిఎం కెసిఆర్ విజన్ తో అన్ని రంగాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని సిఎండి వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో 6000 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ ఉంటే ఇప్పుడు 15,467 మెగా వాట్ల డిమాండ్ ను అధిగమించామని ఇదంతా సిఎం కెసిఆర్ విజన్ తోనే సాధ్యమైందన్నారు. 32 వేల కోట్లు విద్యుత్ ఇన్ఫ్రా స్ట్రక్చర్‌కు ఖర్చు చేశామని, వ్యవసాయ రంగంకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయడంతో వరి ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు.

ఈ క్రమంలో దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. ప్రతి గ్రామంలో సాగు, నీళ్లకు కొదవ లేదని, సిఎం కెసిఆర్ మార్గదర్శనం లో తమ సిబ్బంది నిరంతరం కృషితో ఇవాళ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు అగ్రగామిగా నిలిచాయన్నారు. తెలంగాణ లో విద్యుత్ సరఫరా వల్లనే అనేక పెద్ద పెద్డ అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని, తమ విద్యుత్ సంస్థల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని చూసేందుకు వచ్చినందుకు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సిఎండిలు, డైరెక్టర్లకు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News