Home తాజా వార్తలు 11000 టెస్టులు.. 1178 పాజిటివ్‌లు

11000 టెస్టులు.. 1178 పాజిటివ్‌లు

Telangana records 1,178 new cases, nine deaths

 

పది శాతానికి పడిపోయిన పాజిటివ్ రేటు
రాష్ట్రంలో కరోనా దాడిలో మరో 9 మంది మృతి
జిహెచ్‌ఎంసిలో 736, జిల్లాల్లో 442 మందికి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు స్పల్పంగా తగ్గుతున్నాయి. టెస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్ది కేసులు సంఖ్య తగ్గడం మంచి పరిణామమేనని అధికారులు అంటున్నారు. దీంతో పాజిటివ్ రేట్ కూడా క్రమంగా తగ్గుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకే రోజు 11,062 టెస్టులు చేయగా, 1178 పాజిటివ్‌లు వచ్చాయని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 24 గంటల్లో చేసిన పరీక్షల్లో శనివారం నిర్వహించిన సంఖ్యనే గరిష్ఠం. దీంతో ఈ ఒక్క రోజు 10.64 శాతం పాజిటివ్ రేట్ నమోదైంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు సగటున 25 శాతం నమోదైన పాజిటివిటి ప్రస్తుతం సగానికి తగ్గడంతో అధికారులతో పాటు ప్రజలు సైతం కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రకటిస్తున్న టెస్టుల్లో ఆర్‌టిసిపిఆర్‌తో పాటు యంటిజెన్ టెస్టులు కూడా కలుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు.

కొత్తగా వైరస్ సోకిన వారిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 736, రంగారెడ్డి 125, మేడ్చల్ 101, సంగారెడ్డి 13, ఖమ్మం 2, వరంగల్ అర్బన్ 20, వరంగల్ రూరల్ 2, నిర్మల్ 2, కరీంనగర్ 24, జగిత్యాల 2,యాదాద్రి 9, పెద్దపల్లి 12, మెదక్ 16,మహబూబ్‌నగర్ 12, మంచిర్యాల 5, నల్గొండ 12,సిరిసిల్లా 24,ఆదిలాబాద్ 8, ఆసిఫాబాద్ 1, నారాయణరావుపేట్ 5, వికారాబాద్ 9,జనగాం2, నిజామాబాద్ 12,వనపర్తి 2, సిద్ధిపేట్ 9, సూర్యాపేట్ 7, గద్వాలో ఆరుగురు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 33,402కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 20919కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 12135మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 348కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో 89.3 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. కేవలం గాంధీ ఆసుపత్రిలో 1075 పరుపులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.

Telangana records 1,178 new cases, nine deaths